వేణుమాధవ్‌ కన్నుమూత

ప్రముఖ తెలుగు హాస్య నటుడు వేణు మాధవ్‌ తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు.

నిన్న ఉదయం నుండి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అంటూ వార్తలు వచ్చాయి.

సాయంత్రంకు ఆయన మృతి చెందినట్లుగా వార్తలు వచ్చాయి.అయితే వేణు మాధవ్‌ మృతి వార్తలను కుటుంబ సభ్యులు ఖండించారు.

ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని, ఆయనకు కోలుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు.వేణు మాధవ్‌ను పరామర్శించిన వారు, ఆయన కుటుంబంకు సన్నిహితంగా ఉండే వాళ్లు కూడా నిన్న సాయంత్రం మృతి వార్తలను కొట్టి పారేశారు.

వేణు మాధవ్‌ మృతి వార్తలు పుకార్లే అంటూ క్లారిటీ రావడంతో సినీ వర్గాల వారు మరియు ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకున్నారు.ఇంతలోనే వేణు మాధవ్‌ మృతి అంటూ మళ్లీ వార్తలు వచ్చాయి.

Advertisement

ఈసారి కూడా పుకార్లే అనుకుంటున్న ఫ్యాన్స్‌కు కుటుంబ సభ్యుల నుండి అధికారిక ప్రకటన రావడంతో అంతా షాక్‌ అవుతున్నారు.మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించిన వేణు మాధవ్‌ దాదాపు 600 సినిమాల్లో నటించాడు.

స్టార్‌ హీరోలందరితో కూడా నటించి నవ్వించిన వేణు మాధవ్‌ హీరోగా కూడా చేశాడు.సినిమాలను నిర్మాణం కూడా చేశాడు.

రాజకీయంగా తెలుగు దేశం పార్టీకి మద్దతుగా నిలిచిన ఆయన పలు ఎన్నికల్లో ప్రచారం కూడా చేశాడు.ఆయన మరణంతో తెలుగు సినిమా పరిశ్రమతో పాటు తెలుగు దేశం పార్టీ నాయకులు తీవ్ర దిగ్బ్రాందిని వ్యక్తం చేస్తున్నారు.

సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు
Advertisement