Shivani Rajasekhar: నేను మా ఇంటికి దరిద్రం… అందుకే అలా జరిగింది: శివాని

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డాటర్ గా గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో జీవిత( Jeevitha ) రాజశేఖర్(Rajasekhar) కుమార్తె శివాని రాజశేఖర్(Shivani Rajasekhar) కూడా ఒకరు ఈమె ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు.అయితే అనుకున్న స్థాయిలో శివాని ఇండస్ట్రీలో హీరోయిన్గా సక్సెస్ కాలేకపోతున్నారని చెప్పాలి.

 Shivani Rajasekhar: నేను మా ఇంటికి దరిద్రం-TeluguStop.com

ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా కోటబొమ్మాలి( Kotabommali ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో ఈమె ఖాతాలో మొదటి సక్సెస్ చేరిందని చెప్పాలి.

ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఇందులో భాగంగా శివాని తన తండ్రి గురించి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు ఈమె తన తండ్రితో కలిసి శేఖర్ అనే సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమా కోవిడ్ సమయంలో షూటింగ్ జరుపుకోవడం వల్ల అప్పట్లో రాజశేఖర్ ప్రమాదంలో పడిన సంగతి మనకు తెలిసిందే అయితే ఆ విషయాలను గుర్తుచేసుకొని శివాని చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా శివాని మాట్లాడుతూ శేఖర్ సినిమాలో( Sekhar Movie ) నాన్నతో కలిసిన నటించానని తెలిపారు.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నాకు కరోనా వచ్చింది కరోనా( Corona ) రావడంతో నేను ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను కానీ నాన్నకి కూడా కరోనా వచ్చింది.అయితే నాకు రావడం వల్లే నాన్నకి కూడా వచ్చింది అని నేను భావించాను కానీ నాన్నకు చాలా సీరియస్ అయిందని వెంటిలేటర్ పై ఉండాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయని అప్పటి పరిస్థితులను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.

నాన్న బెడ్ పై అలా పడుకొని ఉన్నారు ఆయన కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.స్యాచురేషన్ కూడా పూర్తిగా పడిపోతుంది.ఆ సమయంలో తనకు చాలా కంగారుగా ఉండేదని ఈమె తెలిపారు.నాన్నకు ఏ క్షణం ఏం జరుగుతుందోనని కంగారులో అంతా ఉన్నామని నాన్నని అలా చూసి తట్టుకోలేక అందరం బాగా ఏడ్చామని శివాని తెలిపారు.

నాన్నకు ఇలా రావడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే అది నేనేనని తెలిసింది.నాకు కరోనా రావడం వల్ల నాన్నకు కూడా కరోనా వచ్చింది.

కరోనా రావటం వల్లే నాన్నకు ఇలా జరిగిందని ఆయనకు ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయపడుతూ ఉండేదాన్ని ఇలా నాన్నకు చాలా సీరియస్ కావడంతో నేను మా ఇంటికి దరిద్రురాలినేమో అందుకే నాన్నకు ఇలా జరిగిందని నాకు నేను ఎన్నో ఊహించుకొని బాగా ఏడ్చేదాన్ని అని శివాని తెలిపారు.అయితే అదృష్టవశాత్తు నాన్న చాలా క్రిటికల్ కండిషన్ నుంచి బయటపడ్డారని, ఒక డాక్టర్ అయినప్పటికీ క్రిటికల్ కండిషన్ లో( Critical Condition ) ఏమి చేయలేని పరిస్థితిలో నాన్నని బెడ్ పై చూసేసరికి చాలా భయపడిపోయామంటూ ఈ సందర్భంగా శివాని చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

https://www.facebook.com/watch/?extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&mibextid=5SVze0&v=361591879663926
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube