Nirupam : ఏంటి కార్తీకదీపం డాక్టర్ బాబు ఇలాంటి పనులు కూడా చేశారా… ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా?

బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు నిరుపమ్ ( Nirupam ) ఒకరు.

బుల్లితెర సీరియల్స్ ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయనకు కార్తీకదీపం ( Karthika Deepam ) సీరియల్ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చింది.

ఈ సీరియల్ లో కార్తీక్ పాత్రలో నటించినప్పటికీ డాక్టర్ బాబుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక ఈయన నిరుపమ్ కంటే డాక్టర్ బాబు గానే అందరికీ గుర్తున్నారని చెప్పాలి ఇక ఈ సీరియల్ తర్వాత పలు సినిమాలలో నిరుపమ్ నటిస్తున్నప్పటికీ ఈయన చేసిన డాక్టర్ బాబు పాత్రను మాత్రం అభిమానులు ప్రేక్షకులు మర్చిపోలేకపోతున్నారు.

ప్రస్తుతం ఈయన ఇతర ఛానల్లో ప్రసారమయ్యే సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి డాక్టర్ బాబుకు తన కెరియర్ గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ సందర్భంగా డాక్టర్ బాబు కూడా తన సీరియల్స్ గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు.ముఖ్యంగా కార్తీకదీపం రెండవ భాగం గురించి ఈయనకు ప్రశ్నలు ఎదురుగా రెండవ భాగం వస్తుందా రాదా అన్నదాని గురించి ఈయన మాట్లాడుతూ అన్ని కుదిరితేనే కార్తీకదీపం రెండవ భాగం ప్రేక్షకుల ముందుకు వస్తుందని దీని గురించి క్లారిటీగా చెప్పలేమని వెల్లడించారు.

ఇక మీకు ఫస్ట్ రెమ్యూనరేషన్( Remuneration ) ఎంత అంటూ కూడా ఈయనకు ప్రశ్నలు ఎదురుగా తాను మొదటిసారి వేయి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాను అంటూ డాక్టర్ బాబు తెలియజేశారు.కాలేజీ టైంలో చేసిన ఒక అల్లరి పని గురించి చెప్పండి అని అడగడంతో ఈ ప్రశ్నకు నిరుపమ్ సమాధానం చెబుతూ ఒకసారి సినిమా థియేటర్లో బ్లాక్ లో టికెట్లు కొనుగోలు చేసి తిరిగి వాటిని బ్లాక్ లోనే అమ్మాము అంటూ బ్లాక్ టికెట్స్( Black tickets ) అమ్మడం గురించి ఈయన సీక్రెట్ బయటపెట్టారు.ఒక సినిమా కోసం తాము బ్లాక్ లో టికెట్స్ కొన్నాము అయితే అవి అక్కడికి తీసుకెళ్లగా ఎంట్రన్స్ లోనే ఇవి అయిపోయిన షోవి అని చెప్పారు.

Advertisement

దీంతో ఏం చేయాలో తెలియక వెనక్కి వచ్చేస్తున్నాము.

ఇంతలోపే మరికొందరు మాకు టికెట్స్ కావాలి అంటూ అడగడంతో మేము బ్లాక్ లో కొన్న టికెట్లను వారికి అమ్మేసామని అయితే వారికి అసలు విషయం తెలిసేలోపు పక్క థియేటర్ కి పారిపోయాము అంటూ ఈ సందర్భంగా డాక్టర్ బాబు చేసినటువంటి పని గురించి తెలియజేశారు.ఇక ఈ విషయం బయటపడటంతో ఇలా బ్లాక్ లో కూడా టికెట్లను అమ్మరా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇక మీకు ఇష్టమైన హీరో హీరోయిన్ ఎవరు అని అడగడంతో తనకు సమంత ( Samantha ) అంటే చాలా ఇష్టమని చాలా అందంగా ఉండటమే కాకుండా ఎంతో అద్భుతంగా నటిస్తూ ఎంతో హార్డ్ వర్క్ చేస్తారని తెలియజేశారు.ఇక మహేష్ బాబు( Mahesh Babu ) అంటే కూడా తనకు ఇష్టమని ఈ సందర్భంగా డాక్టర్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు