ఆ కుట్రలకు నేను కూడా బలయ్యాను అంటున్న లక్ష్మీ పార్వతి !

మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్, వైసీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి.

" చంద్రబాబు నాయుడు మరియు ఆయనను సమర్ధించే ఆంధ్రజ్యోతి, ఈనాడు యాజమాన్యాలపై ఫైర్ అయ్యారు".

చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి, అక్రమాలపై ప్రధానికి లేఖ రాయాల్సి ఉంటే ఈలోపు ఆయనే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ప్రధానికి లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉంది.ప్రధాని గారు స్పందించి చంద్రబాబు నాయుడు పై సిబిఐ విచారణకు ఆదేశించాలి.

Lakshmi Paravati Comments On Chandrababu Naidu , Chandrababu Naidu, TDP, Phone T

అప్పుడు మన చంద్రబాబు నాయుడు చెప్పుకొని తిరిగే నీతి,నిజాయతీ నిజాలు గురించి ప్రజలకు క్లియర్ గా తెలుస్తుంది.చంద్రబాబు నాయుడికి ధైర్యం ఉంటే రాజకీయం చేయకుండా సిబిఐ ఎంక్వైరీ ని స్వాగతించాలని విమర్శించారు.

అంతేకాకుండా ఒకప్పుడు సైకిల్ మీద తిరిగే వేమూరి రాధాకృష్ణ ఉన్నట్టుండి పత్రికాధిపతి ఎలా అయ్యారో అలాగే పచ్చళ్ళు అమ్ముకునే రామోజీరావు ఈరోజు ఇన్ని వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యారో కొద్దిగా చెప్పండి అని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు.ఇక ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడవడానికి అప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలో తాను కూడా బలయ్యానని అన్నారు.

Advertisement

ఈనాడు, ఆంధ్రజ్యోతిని కుడిఎడమలగా పెట్టుకొని చంద్రబాబు నాయుడు చేసినంత అవినీతి అంతా ఇంతా కాదు అని ఆమె ఆరోపించారు.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి
Advertisement

తాజా వార్తలు