తోడబుట్టిన వారి కోసం ఈ గాయని ఎంత త్యాగం చేసిందో తెలుసా.. ?

ఎల్ ఆర్ ఈశ్వరి.అల్లరి పాటలు, మనసులో మత్తెక్కించే గేయాలు పాడిన శృంగార గాయని.

తన వయ్యారపు పాటలో జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.ఒకానొక సమయంలో సి.నారాయణరెడ్డి ఆమె గురించి ఓ మాట చెప్పారు.ఎల్ అంటే లవ్ అని.ఆర్ అంటే రొమాన్స్ అని చమత్కరించాడు.అటు ఆరుద్ర అల్లారు ముద్దుల గాయని అని కొనియాడాడు.

క్లబ్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్ ఎంత బాగా పాడుతారో.భక్తి పాటలను సైతం అంతే అద్భుతంగా పాడుతుంది ఈ గాయనీ మణి.ఎల్‌ఆర్‌ ఈశ్వ‌రి మద్రాసులోని క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది.ఆమె అస‌లు పేరు లూర్ద్ మేరీ.

హిందూ దేవ‌త‌ల్ని కొలిచే నాన‌మ్మ ఇంట్లోల ఆమెను రాజేశ్వ‌రి అని పిలిచేవారు.ఆమె తమిళ సినిమా రంగంలోకి వచ్చేసరికి రాజేశ్వరి అని మరో గాయని ఉండేది.

Advertisement
L R Eswari Sacrifice For Her Siblings, L R Ishwari, Rajeshwari, Christian Famil

దీంతో తన పేరు ఎల్ ఆర్ ఈశ్వరిగా మారింది.ఈశ్వరి వాళ్లమ్మ నిర్మల కూడా సినిమా పాటలకు కోరస్ పాడేది.

కొంతకాలం తర్వాత ఈశ్వరి కూడా తల్లితో పాటు పాటల రికార్డింగ్ సెంటర్ కు వెళ్లేది.మొదట్లో కొన్ని పాటలకు కోరస్ సింగర్ గా పనిచేసింది.

తర్వాత కెవి మహదేవన్ న‌ల్ల ఇడ‌త్తు సంబంధం అనే త‌మిళ మూవీతో ఎల్ ఆర్ ఈశ్వరిని సింగర్ గా పనిచయం చేశాడు.

L R Eswari Sacrifice For Her Siblings, L R Ishwari, Rajeshwari, Christian Famil

తెలుగులో ఆమె పాడిన తొలి చిత్రం అనుబంధాలు.ఇందులో.నా పేరు సెల‌యేరు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

న‌న్నెవ్వ‌రాప‌లేరు అనే పాట బాగా పేరు తెచ్చింది.ఆమె త‌మిళియ‌న్ అయినా తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, తుళు భాష‌ల్లో అద్భుతంగా పాటలు పాడింది.

Advertisement

ఆమెలాగా మ‌త్తు కలిగించడంతోపాటు కైపెక్కించే గొంతుతో పాటలు పాడటం మరెవ్వరికీ సాధ్యం అయ్యేది కాదు.మొత్తం మీద 14 భాష‌ల‌లో వేలాది పాట‌లు పాడింది ఆమె.తన సోదరి, సోదరుడి జీవితం కోసం ఎల్‌.ఆర్‌.

ఈశ్వ‌రి పెళ్లి చేసుకోకుండానే ఉన్నది.ప్రస్తుతం ఆమె సినిమా పాటలు పాడటం మానేసి.

చెన్నైలో నివాసం ఉంటుంది.

తాజా వార్తలు