కేటీఆర్ ను వెంటాడుతున్న ఆ టెన్షన్ ?

టిఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత అన్ని విషయాల్లోనూ యాక్టివ్ గా ఉండేది, ప్రాధాన్యం పొందేది, ఆయన కుమారుడు కేటీఆర్.

తండ్రికి తగ్గ తనయుడిగా, కేటీఆర్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ, చెరగని ముద్ర వేసుకున్నారు.

కెసిఆర్ యాక్టివ్ గా ఉన్నా , లేకపోయినా ఏ ఇబ్బంది లేకుండా అన్ని వ్యవహారాలను చక్కబెట్టే స్థాయిలో కేటీఆర్ వ్యవహరిస్తున్నారు.రెండోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత, కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేద్దాము అనే ఆలోచనలో  కెసిఆర్ ఉండగా, ఎప్పుడు ఏదో ఒక ఆటంకం ఏర్పడటం, అది కాస్త వాయిదా పడడం వంటి సంఘటనలు జరుగుతూ వస్తున్నాయి.

ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముగిసిన వెంటనే కేటీఆర్ కు సీఎంగా పట్టాభిషేకం చేస్తారని, కెసిఆర్ జాతీయ రాజకీయాల వైపు మొగ్గు చూపుతారని ప్రచారం జరుగుతుండగా,  ఇప్పుడు తెలంగాణలో చోటుచేసుకుంటున్న పరిస్థితులు కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు పై ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది.

మొన్నటి దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలతోనే టిఆర్ఎస్ లో నిస్తేజం అలుముకుంది.టిఆర్ఎస్ రాజకీయ పరిస్థితిని తెలియజేశాయి.ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు జరగబోతుండడం తో, ఓటర్లు ఏ విధంగా తీర్పు ఇస్తారు అనేది టెన్షన్ గా మారింది.ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికలు అందరికంటే ఎక్కువగా కేసీఆర్ కు ప్రతిష్టాత్మకం కాబోతున్నాయి.2016 లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో కేటీఆర్ సత్తా చూపించి, మేయర్ పీఠాన్ని పార్టీకి బహుమతిగా ఇచ్చారు.ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే గ్రేటర్ ఎన్నికలకు వెళ్లి  గెలిచి చూపించాలని టిఆర్ఎస్ పార్టీ భావిస్తుండగా,  ఆకస్మాత్తుగా బిజెపి బలపడడం,50, 60 స్థానాలకు పైగా దక్కించుకో బోతున్నట్టు గా వివిధ సర్వే రిపోర్టులు వస్తుండడం, అకస్మాత్తుగా గ్రేటర్  ను ముంచెత్తిన వరదలు కారణంగా ప్రజాగ్రహం ప్రభుత్వంపై పెరగడం,  ఇవన్నీ గ్రేటర్ ఎన్నికల్లో తమకు కలిసి వస్తాయని, టిఆర్ఎస్ పార్టీ భావిస్తోంది.

Advertisement

దీంతో ఫలితాలు ఆశాజనకంగా ఉండవు అనే అభిప్రాయానికి టిఆర్ఎస్ నాయకులు వచ్చేశారు.ప్రస్తుతం మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉండడంతో, ఆయనకు ఈ  ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం.

ఈ ఎన్నికల ఫలితాల తర్వాత సిఎం పీఠంపై కూర్చోవాలన్నా, ఎటువంటి విమర్శలు రాకుండా ఉండాలన్నా,  గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది.అదీ కాకుండా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ, గ్రేటర్ ఫలితాలపై ప్రభావం తప్పకుండా ఉండే చాన్స్ ఉండడంతో, టిఆర్ఎస్ కాస్త టెన్షన్ పడుతున్నట్లు గా కనిపిస్తోంది.

అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక మోస్తరు పేరు ప్రఖ్యాతలు ఉన్న నాయకులందరినీ గ్రేటర్ లో మోహరించినట్లుగా కనిపిస్తోంది.ఒకవైపు ప్రభుత్వం పై పెరిగిన వ్యతిరేకతను తగ్గించుకు ని ప్రత్యర్థులకు అవకాశం దక్కకుండా,  మరోసారి గ్రేటర్ పై టీఆర్ఎస్ జెండా ఎగురవేసే విధంగా కేటీఆర్ గట్టిగానే కష్టపడుతున్నారు.

ఒకవేళ ఇక్కడ ఫలితాలు తేడా కొడితే కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడినట్లే అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు