పరిపూర్ణ నాయకుడిగా ఆవిష్కరించుకుంటున్న కేటీఆర్!

సాధారణంగా ఎన్నికల ప్రచారం అనగానే రాజకీయ నాయకులు అబద్దాలు అర్థసత్యాలతో హోరేత్తిస్తుంటారు.

తాము చేసింది గోరంత అయినా కొండంత అభివృద్ది చేశామని తాము తప్ప ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించే నాయకుడు లేడు అన్నట్లుగా స్వకుచమర్దనం చేసుకుంటారు.

అలానే ప్రతిపక్షాల గత పరిపాలన మొత్తం అవినీతిమయమేనని సర్టిఫై చేస్తూ ఉంటారు.అయితే తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా వివిధ మీడియా వర్గాలతో మాట్లాడుతూ బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) చేస్తున్న వ్యాఖ్యలు ఆయన తనను తాను సరికొత్త లీడర్ గా ఆవిష్కరింప చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది .

తమ పరిపాలన లో కూడా కొన్ని తప్పులు జరుగి ఉండొచ్చని అయితే వాటిని కచ్చితంగా సరి చేసుకుంటామని చెప్పడం ద్వారా తమ పరిపాలనలో కూడా కొన్ని వైఫల్యాలు ఉన్నాయని ఆయన అంగీకరించినట్లయ్యింది .అంతే కాకుండా ఇతర పార్టీల నాయకులతో తనకు వ్యక్తిగత విభేదాలు ఉండవని తన అంతిమ లక్ష్యం తెలంగాణ( Telangana ) సర్వతోముఖంగా అభివృద్ధి చెందటమే అన్నట్లుగా చెప్పడం చూస్తే ఆయన ఖచ్చితంగా సాంప్రదాయ రాజకీయ నాయకులకు భిన్నంగా పరిణితి చెందిన లీడర్ గా కనిపిస్తున్నాడని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

తమ ప్రవర్తనకు మాటలకు నిజాయితీగా లంకె వేసే మనుషులు ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు.తమది మాత్రమే గొప్ప రాజకీయ అన్న స్థానే తాము నేర్చుకుంటామని సరిదిద్దుకుంటామని చెప్తున్న మాటలు చూస్తే కచ్చితంగా పరిణితి చెందిన రాజకీయం కిందే భావించాలి. ఎన్నికల్లో డబ్బులు పంచడంపై కూడా ఆయన తన స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రకటించారు.

Advertisement

అసలు తనకు తాయిలాలతో ఓటర్ ను ఆకర్శించడం నచ్చదని అయితే తప్పనిసరి వాతావరణంలో కొన్నిసార్లు రాజీ పడాల్సి వస్తుందంటూ చెప్పుకొచ్చారు.గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే తనను తాను ఆత్మ పరిశీలన చేసుకొన్న నాయకుడిగా కేటీఆర్ వాఖ్యలకు కచ్చితంగా ప్రజల మద్దతు ఉంటుందని రాష్ట్రం లో మెజారిటీ ఓటర్లుగా ఉన్న యువతను ఆకట్టుకునేలా కేటీఆర్ వ్యవహార శైలి ఉందని మాత్రం వ్యాఖ్యలు వస్తున్నాయి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు