Minister Jupally Krishna Rao : కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేది లేదు..: మంత్రి జూపల్లి

తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు( Minister Jupally Krishna Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.

కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు( Krishna River Management Board ) కృష్ణా ప్రాజెక్టులను అప్పగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

నీటి పంపకాల వ్యవహారంపై బీఆర్ఎస్ ( BRS ) కొత్త నాటకానికి తెర తీసిందని విమర్శించారు.పరువు నిలబెట్టుకునేందుకు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.

కృష్ణా నీటి వాటా కోసం కేంద్రాన్ని బీఆర్ఎస్ అడగలేదని చెప్పారు.

Krmb Will Not Hand Over Projects Minister Jupalli

అలాగే కేటాయించిన నీటిని కూడా వాడుకోలేదని మండిపడ్డారు.కేంద్రం ఎటువంటి హామీ ఇవ్వకుండానే సుప్రీంకోర్టులో( Supreme Court ) కేసు విత్ డ్రా చేసుకున్నారని వెల్లడించారు.రాయలసీమ ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించారన్న మంత్రి జూపల్లి కుట్రలో భాగంగానే ఏపీకి గత ప్రభుత్వం సహకారం అందించిందని ఆరోపించారు.

Advertisement
Krmb Will Not Hand Over Projects Minister Jupalli-Minister Jupally Krishna Rao
పైనాపిల్ చేసే మ్యాజిక్.. ఇలా వాడారంటే స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతం అవ్వాల్సిందే!

తాజా వార్తలు