టాలీవుడ్ ఇండస్ట్రీలోని బెస్ట్ జోడీలలో రమ్యకృష్ణ కృష్ణవంశీ జోడీ కూడా ఒకటి.ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
అటు రమ్యకృష్ణ ఇటు కృష్ణవంశీ ఇప్పటికీ కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.కృష్ణవంశీ త్వరలో రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.
అయితే తాజాగా కృష్ణవంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించడం గమనార్హం.
శ్రీకాంత్ గారి వందో సినిమా ముందు అనుకున్నది కాదని ఆయన తెలిపారు.సిరివెన్నెల గారు భౌతికంగా మరణించినా ఆయన మనతోనే ఉంటారని కృష్ణవంశీ పేర్కొన్నారు.ఆయనకు సిచ్యువేషన్ చెప్పడం వరకు మాత్రమే నా బాధ్యత అని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

ఆయన పాట ఇస్తే ప్రసాదం తీసుకున్నట్టు తీసుకుని వెళ్లిపోయేవాడినని కృష్ణవంశీ పేర్కొన్నారు.సినిమాల్లోకి వెళితే లైఫ్ నాశనమవుతుందని నాన్న చెప్పారని కృష్ణవంశీ పేర్కొన్నారు.పెళ్లి అంటే బందీలా ఉండిపోవడం అని నా ఫీలింగ్ అని ఆయన తెలిపారు.
నేను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతానని ఆయన తెలిపారు.కానీ రమ్యకృష్ణతో పెళ్లి విషయంలో తప్పించుకోలేదని కృష్ణవంశీ అన్నారు.

పెళ్లి తర్వాత జీవితంలో పెద్దగా మార్పు రాలేదని ఆయన తెలిపారు.గాసిప్స్ అనేవి సాధారణం అని ఆయన కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కొడుకు సినిమాల్లోకి వస్తాడో లేదో నేను చెప్పలేనని ఆయన తెలిపారు.రంగమార్తాండ సినిమాతో కృష్ణవంశీ కెరీర్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తుందేమో చూడాలి.ఈ సినిమా విజయం సాధిస్తే స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశాన్ని కృష్ణవంశీ సొంతం చేసుకుంటారని కామెంట్లు వినిపిస్తున్నాయి.కృష్ణవంశీ ప్రస్తుతం పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.