రాజమౌళి 'బాహుబలి' తీసినట్లుగా కృష్ణవంశీ 'రంగమార్తాండ'.. ఫలితం ఏంటో!

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి బాహుబలి మరియు ఆర్ఆర్ఆర్ సినిమాలను ఏళ్లకు ఏళ్లు తెరకెక్కించిన విషయం తెల్సిందే.ఆ రెండు సినిమాలు కూడా వేల కోట్ల వసూళ్లను రాబట్టాయి.

 Krishna Vamshi Rangamarthanda Movie Release Update , Krishna Vamshi , Prakash-TeluguStop.com

కనుక అంత సమయం తీసుకున్నా కూడా జక్కన్న పై విమర్శలు రాలేదు.కానీ క్రియేటివ్‌ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాను ఏకంగా నాలుగు అయిదు సంవత్సరాలుగా తీస్తున్నాడు.

కరోనాకు ముందు రంగమార్తాండ సినిమా ప్రారంభం అయ్యింది.ఇప్పటి వరకు కూడా విడుదల తేదీ విషయంలో క్లారిటీ రాలేదు.

గతంలో ఎన్నో సార్లు అదుగో ఇదుగో అన్నట్లుగా ఈ సినిమా యొక్క విడుదల తేదీ పై ప్రచారం జరిగింది.కానీ ఇప్పటి వరకు కృష్ణవంశీ యొక్క రంగమార్తాండ సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు.

Telugu Baahubali, Brahmanandam, Chiranjeevi, Krishna Vamshi, Prakash Raj, Rajamo

చిరంజీవితో వాయిస్ ఓవర్ ఇప్పించడం మొదలుకుని బ్రహ్మానందం తో కీలక పాత్ర ను చేయించడం.ప్రకాష్ రాజ్.రమ్యకృష్ణ.రాహుల్‌ సిప్లిగంజ్ మరియు శివాత్మిక ఇలా ఎంతో మంది ప్రముఖ నటీ నటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు.భారీ ఎత్తున అంచనాలున్న రంగమార్తాండ సినిమా ను మరాఠి మూవీ నట సామ్రాట్ కు రీమేక్ గా రూపొందిస్తున్న విషయం తెల్సిందే.

Telugu Baahubali, Brahmanandam, Chiranjeevi, Krishna Vamshi, Prakash Raj, Rajamo

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ను తెలుగు నేటివిటీకి మరియు తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చి రూపొందించారనే వార్తలు వస్తున్నాయి.ఒక నటుడి జీవితంలో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణలు మరియు ఇతర విషయాల గురించి ఈ సినిమాలో చూపించడం జరిగిందట.రంగమార్తాండ సినిమా యొక్క విడుదల తేదీ విషయమై ఈ ఏడాది స్పష్టత వస్తుందా.

రాజమౌళి రేంజ్ లో ఇన్నాళ్లు కృష్ణవంశీ చెక్కిన ఈ సినిమా యొక్క ఫలితం ఎలా ఉంటుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube