తొలిసారిగా రాజేష్ దొండపాటి( Rajesh Dondapati ) డైరెక్షన్లో రూపొందిన సినిమా కృష్ణ గాడు అంటే ఒక రేంజ్.ఈ సినిమాలో రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ, రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహాదేవ్ తదితరులు నటించారు.
కొత్త హీరో హీరోయిన్ లే కాకుండా దర్శకుడు, నిర్మాత కూడా కొత్త వాళ్లే.ఈ సినిమాను శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకటసుబ్బయ్య, పి ఎన్ కే శ్రీలత నిర్మించారు.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, కొన్ని పాటలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.మంచి ఫీల్ గుడ్ ప్రేమ కథ నేపథ్యంలో ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ సినిమా కొత్తగా పరిచయమైన దర్శకుడికి, నటీనటులకు ఎటువంటి సక్సెస్ అందించిందో చూద్దాం.
కథ:
కథ విషయానికి వస్తే.కృష్ణ (రిష్వి తిమ్మరాజు)( Rishvi Thimmaraju ) అనే కుర్రాడు చిన్నప్పటినుంచి తను అంటే ఒక రేంజ్ అన్నట్టు బతికేస్తూ ఉంటాడు.ఇక ఆయన తండ్రి చిన్నతనంలోనే చనిపోగా తమ ఇంటి నిర్మాణపు పనులు మధ్యలోనే ఆగిపోతాయి.
దీంతో తల్లి చాటు బిడ్డగా పెరుగుతాడు.ఇక ఊరిలో అందరి మంచి పేరు సంపాదించుకుంటాడు.
ఇక అదే ఊర్లో ఉన్న సత్య( Sathya ) అనే తన బంధువుల అమ్మాయితో ప్రేమలో పడతాడు.అయితే వీరి మధ్యలోకి దేవా అనే వ్యక్తి వస్తాడు.
అతడు రావటంతో వారి జీవితంలో ఏం జరుగుతుంది.రౌడీ మల్లయ్య ని ఎవరు చంపుతారు.
చివరికి కృష్ణ గాడి లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
నటీనటుల నటన విషయానికొస్తే.రిష్వి తిమ్మరాజు మొదటిసారి హీరోగా పరిచయమైన కూడా కృష్ణ పాత్రలో బాగా నటించాడు.పైగా ఎమోషన్స్ం, కామెడీ, యాక్షన్స్ సన్నివేశాలలో కూడా అద్భుతంగా పర్ఫామెన్స్ చేశాడు.
హీరోయిన్ విస్మయ( Vismaya Sri ) కూడా పల్లెటూరి అమ్మాయిగా అద్భుతంగా కనిపించింది.ఇక మిగతా నటీనటులంతా తమ పాత్రకు తగ్గట్టుగా పనిచేశారు.
టెక్నికల్:
టెక్నికల్ విషయానికి వస్తే.ఈ సినిమా మ్యూజిక్ బాగా ఆకట్టుకుంది.ఆర్ఆర్ కూడా పరవాలేదు అన్నట్లుగా ఉంది.ఎడిటింగ్ కూడా బాగుంది.ఎక్కువగా సాగదివ్వకుండా సినిమాను తక్కువ సమయంలో అద్భుతంగా చూపించాడు డైరెక్టర్.మిగిలిన నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా పనిచేసాయి.
విశ్లేషణ:
ఇప్పటివరకు ఎటో రకాల ప్రేమ కథలను చూశాం.అయితే ఈ సినిమా మాత్రం అన్ని రకాల నవరసాలతో చూపించాడు డైరెక్టర్.
పైగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా ఈ సినిమాను చూపించాడు.ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా డైరెక్టర్ ఈ సినిమాను అద్భుతంగా చూపించాడు.
ప్లస్ పాయింట్స్:
ఫస్టాఫ్, కథనం, ఎమోషన్స్, మ్యూజిక్, నటీనటుల పర్ఫామెన్స్.
మైనస్ పాయింట్స్:
కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీసినట్లు అనిపించాయి.
బాటమ్ లైన్:
చివరిగా చెప్పాల్సింది ఏంటంటే.ఈ సినిమాను మంచి లవ్ స్టోరీతో పాటు మంచి ఎమోషనల్ గా చూపించాడు డైరెక్టర్.కాబట్టి థియేటర్ లో ఒకసారి చూస్తే సరిపోతుంది.