కృష్ణా జిల్లాకి “ఎన్నారై” ల భారీ సాయం

జన్మ నిచ్చిన తల్లిపై ఎంత ప్రేమాభిమానాలు ఉంటాయో అలాగే పుట్టిన గడ్డపై కూడా అంతే ప్రేమ ఉంటుంది అయితే ఆ ప్రేమని చూపించడానికి సరైన సందర్భం రావాలి అంతే.

అయితే ఆ సందర్భం రానే వచ్చింది నవ్యాంద్ర లో కీలక భాగం అయిన కృష్ణా జిల్లా కోసం తమ జిల్లా ఋణం తీర్చు కోవడం కోసం ప్రవాసులు నడుం బిగించారు.

తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు అందుకు తగ్గట్టుగానే ఒక ప్రనాలికని సిద్దం చేసుకున్నారు.

తమ జిల్లాపై ఉన్న ప్రేమ అమెరికాలో సుమారు పదివేల మంది ప్రవాసాంధ్రులని కదిలించింది.తరగతి గదుల్లో సంపూర్ణ డిజిటల్‌ విద్యా బోధన, అసంపూర్ణ అంగన్‌వాడీ భవనాల అభివృద్ధికి, జిల్లాలోని వేలాది మంది గర్భిణులు, బాలింతలు, పిల్లలతో పాటు సాధారణ ప్రజల ఆరోగ్యం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించటానికి సిద్దం అయ్యారు అమెరికాలో పది వేల మంది సభ్యులతో కూడిన కృష్ణా జిల్లాకు చెందిన అతి పెద్ద ప్రవాసాంధ్ర గ్రూపుతో ఆదివారం జిల్లా కలె క్టర్‌ లక్ష్మీకాంతం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.గ్రూపులోని 108 మంది ప్రతినిధులు 35 రాష్ర్టాల నుంచి పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రవాసాంధ్రులు నాదెండ్ల సురేష్‌.మరియు కాశికుర్తి రాజ.పామర్తి రామ కృష్ణ, నల్లమల రాధాకృష్ణ, రావు ఎస్‌.లింగ, గుమ్మడి రత్నప్రసాద్‌ ఇలా మొదలగు వారు ఇక్కడ జరుగుతున్నా వివిధ ప్రాజెక్టులు, వాటి విధానాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

అయితే కృష్ణా కలెక్టరేట్‌కు ఐఎస్‌వో 9001 సర్టిఫికెట్‌ వచ్చిందని, పరిశ్రమలు పెట్టేవారికి సింగి ల్‌ విండో అమలు చేస్తున్నామని కలేకర్ట్ తెలిపారు.అయితే జిల్లాలో టెక్నాలజీ పరంగా అమలు చేస్తున్న వారిని మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌తో పాటు అనేక దేశాల వారు అధ్యయనం చేయటానికి వస్తున్నారని.

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను చేపడుతున్నట్టుగా తెలిపారు ఆ తర్వాత జిల్లాలో సామాజిక సంక్షేమ కార్య క్రమాల అమలును ప్రస్తావించారు.ఆరు నెలలు కొనసాగించే కార్య క్రమానికి మూడు నెలలు దీనికి అయ్యే వ్యయాన్ని సంపూర్ణంగా భరిస్తామని ప్రవాసాంధ్ర ప్రతినిధు లు హామీ ఇచ్చారు.ప్రవాసాంధ్రుల సహకారంతో రూ.3 కోట్లతో జిల్లాలో 200 పాఠ శాలలల్లో డిజిట ల్‌ తరగతులు ఏర్పాటు చేశామని తెలిపారు అంతేకాదు సుమారు 234 పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.అయితే వాటికోసం జిల్లా యంత్రాంగం తరపున సర్వ శిక్షా అభియాన్‌ ద్వారా 30 - 40 శాతం నిధులు ఇవ్వగలమన్నారు.

దీనికి కూడా ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున సాయాన్ని ప్రకటించారు.తాము మిగిలిన 60 శాతం నిధులు సమకూరుస్తామన్నారు.వైద్యపరంగా తాము ప్రజల్లో అవగాహన కల్పించేందుకు టెలి మెడిసిన్‌ కేంద్రాల ఏర్పాటుకు సహ కారం అందిస్తామని తెలిపారు .

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు