కామ్రేడ్స్‌ను నమ్ముకున్న కొరటాల

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ టాలీవుడ్‌లో వరుస సక్సెస్ చిత్రాలను తెరకెక్కిస్తూ స్టార్ హీరోలందరికీ అదిరిపోయే బ్లాక్‌బస్టర్స్‌ను అందిస్తూ వస్తున్నాడు.

కాగా ఈ డైరెక్టర్ తెరకెక్కించే చిత్రాలు సోషల్ మెసేజ్‌తో వస్తుండటంతో ప్రేక్షకులు వాటికి బ్రహ్మరథం పట్టారు.

ఇక ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య చిత్రం కూడా ఓ గ్రామంలోని సమస్యను హీరో ఎలా పరిష్కరిస్తాడు అనే అంశాన్ని మనకు చూపించనున్నాడు.కాగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని మనకు మరో లెవెల్‌లో చూపించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నాడు.

Koratala Siva Movies On Naxalite Backdrop, Koratala Siva, Naxalite Backdrop, Ach

అయితే ప్రస్తుతం కొరటాల తెరకెక్కిస్తున్న చిత్రాలు వరుసగా నక్సల్ నేపథ్యంలో సాగుతుండటం విశేషం.ఇప్పటికే తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ నక్సలైట్ పాత్రలో తన నెక్ట్స్ చిత్రాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా నేపథ్యం కూడా కామ్రేడ్‌ల చుట్టూ తిరుగుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఇక ఈ సినిమా తరువాత కొరటాల మరో కథను కూడా రెడీ చేస్తున్నాడట.

Advertisement

అయితే ఈ కథ కూడా కామ్రేడ్‌ల నేపథ్యంలో సాగనుందని ఫిలింనగర్ టాక్.మొత్తానికి కొరటాల శివ వరుసగా కామ్రేడ్‌ల నేపథ్యంలో సినిమాలు చేస్తుండటంతో ఆయన ఎలాంటి కథలను రెడీ చేస్తున్నాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇక ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ చిత్రం ఇప్పటికే 40 శాతానికిపైగా షూటింగ్‌ను పూర్తి చేసుకోగా కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడింది.అయితే ఇప్పుడు సినిమా షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కావడంతో ఆచార్య చిత్ర షూటింగ్‌ను కూడా తిరిగి ప్రారంభించాలని కొరటాల ప్రయత్ని్స్తున్నాడు.

ఇక ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు