యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) తాజాగా కొరటాల శివ ( Koratala Shiva ) దర్శకత్వంలో దేవర( Devara ) సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల దర్శకత్వంలో రాబోతున్న దేవర సినిమాకు కమిట్ అయ్యారు.
అయితే ఈ సినిమా ప్రస్తుతం ఏమాత్రం గ్యాప్ లేకుండా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో జనవరిలో షూటింగ్ పూర్తి చేయాలని పక్కా ప్లానింగ్ తో చిత్ర బృందం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుతున్నారు.
మొన్నటివరకు గోవాలో షూటింగ్ జరుపుకున్నటువంటి చిత్ర బృందం తాజాగా హైదరాబాద్లో సరికొత్త షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభించారు.ఇందుకు సంబంధించిన అప్డేట్ కూడా విడుదల చేశారు.

దీపావళి పండుగకు చిన్న బ్రేక్ ఇచ్చినటువంటి చిత్ర బృందం తిరిగి హైదరాబాద్లో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక విలేజ్ సెట్ వేసి షూటింగ్ జరగబోతున్నారట అలాగే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కూడా కొంత భాగం చిత్రీకరణ చేయబోతున్నారని తెలుస్తోంది.చిన్న పండగ బ్రేక్ తర్వాత మా టీం ఎపిక్ షెడ్యూల్ కోసం మళ్లీ సెట్ మీదకు వచ్చింది అంటూ ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ విడుదల చేశారు.అయితే ఇందులో భాగంగా ఒక పాటను చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది.అనిరుద్ సంగీత సారథ్యంలో తెరకెక్కబోతున్నటువంటి ఈ పాట సినిమాకే హైలెట్ కాబోతుందని సమాచారం.

ఇక ఈ పాటకు కొరియోగ్రఫీ చేయడానికి నాటు నాటు ఫేమ్ ప్రేమ్ రక్షిత్ ( Prem Rakshith ) రంగంలోకి దిగారు.ఈయన ఎన్టీఆర్ నటించిన కంత్రి, అదుర్స్, RRR సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు.ఇక ఈయన చేసినటువంటి నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ పాటను మించి ఎన్టీఆర్ దేవర సినిమాలో సరికొత్త పాటను షూట్ చేయబోతున్నారని ఈ పాట కోసం ఏకంగా రెండు వేల మంది ఆర్టిస్టులను కూడా కొరటాల రంగంలోకి దింపారని తెలుస్తుంది.
రెండు వేల మందితో ఎన్టీఆర్ పాత్రని ఎలివేట్ చేసేలా చిత్రీకరించే ఈ పాట థియేటర్లో అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయం అని తెలుస్తుంది.ఇలా ఈ సినిమాకు నుంచి ఈ వార్త వైరల్ గా మారడంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి.