తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం..

కోయిల్ ఆల్వార్ తిరుమంజనం సందర్భంగా ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేసిన టీటీడీ.వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముందు వచ్చే మంగళవారం రోజు స్వామివారి ఆలయాన్ని శుద్ధి చేసిన టిటిడి అధికారులు.

 Koil Alwar Thirumanjanam Tirumala Ttd On The Occasion Of  Vaikuntha Ekadashi, Tt-TeluguStop.com

సంవత్సరంలో నాలుగు రోజులు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ తెలిపారు.వైకుంఠ ఏకాదశి సందర్భంగా సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తిరుపతిలో 100 కౌంటర్లు, తొమ్మిది ప్రాంతాల్లో ఏర్పాటు చేసి దాదాపు రోజుకి 50,000 నుంచి 60,000 మందికి స్వామి వారి దర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఈవో తెలిపారు.

ఎక్కువ సేపు క్యూ లైన్ లో వేచి ఉండకుండా టైం స్లాట్ విధానాన్ని ఏర్పాటు చేశామని టీటీడీ బోర్డు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వైకుంఠ ద్వారాన్ని పది రోజులపాటు ఏర్పాటు చేసామని ఈవో అనిల్ కుమార్ సింగల్ తెలిపారు.వసతి సముదాయాల్లో కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం టోకెన్ ఉన్న వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అకామిడేషన్ కల్పిస్తామని అనిల్ కుమార్ సింగల్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube