మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని!

ఏపీ మంత్రి కోడాలి నాని ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

డిక్లరేషన్ పై సంతకం పెట్టి, సతీసమేతంగా ఏపీ సీఎం జగన్ తిరుమల వేంకటేశ్వరస్వామి ని దర్శించుకోవాలి అంటూ బీజేపీ నేతల వ్యాఖ్యలపై స్పందించిన కొడాలి సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ కు సలహా ఇచ్చేముందు ప్రధాని నరేంద్ర మోడీ తన భార్యను వెంటబెట్టుకొని రామాలయంలో పూజలు చేయమని చెప్పండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అంతేకాకుండా బీజేపీ నేతలపై కొడాలి మండిపడ్డారు.

Kodali Sensational Comments On Modi Modi, Koali Nani, Tirumala, YSRCP, Ramalaya

వైసీపీ ఎలా ఎవరిని ఉంచాలి,తొలగించాలి అన్న విషయాలు వైసీపీ కి బీజేపీ నేతలు చెప్పాల్సిన అవసరమేముంది అని, ఎవరి పార్టీ వ్యవహారాలు వారు చూసుకుంటే అందరికి మంచిది అంటూ నాని వ్యాఖ్యానించారు.రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా సోము వీర్రాజు ఎన్నికైన తర్వాత నుంచే హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని మేము అంటే ఆయనను పదవి నుంచి తొలగిస్తారా? అసలు పది మందిని వెంట పెట్టుకెళ్లి అమిత్ షాను, కిషన్ రెడ్డిని తొలగించాలి అని డిమాండ్ చేస్తే తొలగిస్తారా? అని కొడాలి మండిపడ్డారు.అంతేకాకుండా నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న బీజేపీ నేతలు వైసీపీ కి సలహా ఇవ్వడం హాస్యాస్పదం అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

నోటా కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోవాలి అనే విషయం పై బీజేపీ నేతలు ఆలోచించాలి అంటూ ఆయన హితవు పలికారు.

Advertisement
ముక్కు దిబ్బడతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసం!

తాజా వార్తలు