కృష్ణా జిల్లా గుడివాడ 36వ వార్డులో కోటి 50 లక్షల అమృత్ నిధులతో నిర్మించిన వాటర్ ట్యాంక్ ను మాజీ మంత్రి కొడాలి నాని, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరీ ప్రారంభించారు.తొలుత ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన కొడాలి నాని, బాలసౌరీలను వైసిపి నాయకులు, వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా క్రేన్ ద్వారా భారీ గజమాలను నాయకులు ఇరువురికి వేస్తూ పార్టీ నేతలు తమ అభిమానాన్ని చాటుకున్నారు.
రాష్ట్రంలోని పేదల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలచే రోజు బూతులు తిట్టించుకుంటున్నారని, జగన్ ను ఓడించడానికి రాజకీయ శక్తులు చేస్తున్న కుట్రలను ప్రజలు విచ్ఛిన్నం చేయాలని మాజీ మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు.
డిసెంబర్ నెలలో మచిలీపట్నం పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గుడివాడ అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ బాలశౌరి అన్నారు.