చంద్రబాబు, బాలకృష్ణపై కొడాలి నాని ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణపై మాజీమంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.తండ్రిని చంపిన చంద్రబాబుతో షోలు చేస్తున్న బాలకృష్ణకు సిగ్గుందా అని ప్రశ్నించారు.

షోల పేరుతో కొడుకు, అల్లుడు ఎన్టీఆర్ ని ఇంకా హింసిస్తున్నారని మండిపడ్డారు.ఎన్టీఆర్ కాళ్ల దగ్గరే ఉండి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని, ఇప్పుడు ప్రజల కళ్లు గప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

అంతేకాకుండా పవన్ కల్యాణ్ రాజకీయ అజ్ఞాని అని మరోసారి రుజువైందని చెప్పారు.చంద్రబాబు చిల్లరకు పవన్ ఆశపడుతున్నారని విమర్శించారు.

అమరావతి రైతులు, టీడీపీ, జనసేన తోక పార్టీలు చేస్తున్న పాదయాత్రకు విరుగుడే విశాఖలో జేఏసీ సభ అని తెలిపారు.

Advertisement
అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నారా..?

తాజా వార్తలు