అబ్బవరం లక్ మామూలుగా లేదుగా.. ప్లాప్‌ అయినా స్టార్‌ బ్యానర్‌ లో మూవీ

రాజా వారు రాణి గారు మరియు ఎస్ .ఆర్ కళ్యాణ మండపం సినిమాల్లో హీరోగా నటించిన కిరణ్ అబ్బవరం అదృష్టం బాగున్నట్లు అనిపిస్తుంది.

అతడు వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు.మొదటి రెండు సినిమాలు బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ సినిమాలు కాదు.

అయినా కూడా వరుస సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.తాజాగా ఈయన నటించిన సెబాస్టియన్‌ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇటీవల విడుదలైన ఆ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి.ఏ మాత్రం ఆకట్టుకోలేదు అంటూ ప్రేక్షకులు కూడా కామెంట్స్ చేశారు.

Advertisement
Kiran Abbavaram New Movie In Allu Aravind Geetha Arts Baner, Kiran Abbavaram ,

సినిమా థియేటర్ల నుంచి వెళ్లి పోయే పరిస్థితి కనిపిస్తుంది.సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా కొత్త సినిమాను కిరణ్ మొదలు పెట్టాడు.

నేడు అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ అంటూ ఒక కొత్త సినిమాను మొదలు పెట్టడం జరిగింది.ఈ సినిమా ను చిన్న చిత్రాల నిర్మాతలు నిర్మిస్తే ఏమో అనుకోవచ్చు కానీ ఏకంగా అల్లు అరవింద్ కాంపౌండ్ నుంచి ఈ సినిమా నిర్మాణం జరుగుతోంది.

గీతాఆర్ట్స్ 2 బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నేడు తిరుపతి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సమక్షంలో చిత్ర యూనిట్ సభ్యులతో వైభవంగా జరిగింది.పెద్ద ఎత్తున అంచనాల నడుమ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి.

ఈ సినిమా గురించి ఇప్పటి వరకు అనేక రకాలుగా చర్చ జరుగుతూనే ఉంది.

Kiran Abbavaram New Movie In Allu Aravind Geetha Arts Baner, Kiran Abbavaram ,
పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

ఈ చిత్ర కథ అల్లు అరవింద్ కి బాగా నచ్చడం వల్ల ఈ సినిమా నిర్మించేందుకు ఓకే చెప్పి ఉంటాడు అని తెలుస్తోంది.అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా అతి త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.సినిమా షూటింగ్ ప్రారంభమైన వెంటనే తక్కువ సమయంలోనే పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట.

Advertisement

ఈ ఏడాదిలోనే వినరో భాగ్యము విష్ణు కథ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కిరణ్ సన్నిహితులు అంటున్నారు.

తాజా వార్తలు