30 మందిని మనువాడిన కిలేడీ.. ఇంకో పెళ్లికి సిద్ధమవుతుండగా.. షాక్

నేటి సమాజంలో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.ఈ విషయం చిన్న పిల్లాడిని అడిగినా కానీ చెప్పేస్తున్నారు.

 Killedi Pleaded With 30 People While Preparing For Another Wedding Shock , Prakash Chandra Bhat, Paresh Jain, Reena Thakur, Lady , Marriage-TeluguStop.com

ఒకప్పుడు మగవారే నేరాలు చేసి ఇతరులను మోసం చేసేవారు.కానీ ప్రస్తుతం నేరాల్లో ఆడవాళ్లు కూడా ఆరితేరారు.

వీరు చేస్తున్న మోసాలు చూస్తే ఎవరికైనా సరే వామ్మో అనిపించేలా ఉంటున్నాయి.అమాయకులను పెళ్లి పేరుతో మోసం చేసే కిలేడీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

 Killedi Pleaded With 30 People While Preparing For Another Wedding Shock , Prakash Chandra Bhat, Paresh Jain, Reena Thakur, Lady , Marriage-30 మందిని మనువాడిన కిలేడీ.. ఇంకో పెళ్లికి సిద్ధమవుతుండగా.. షాక్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ఘటనలు మనకు ఎక్కువగా ఉత్తరప్రదేశ్, మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి.ప్రస్తుతం మధ్యప్రదేశ్ కు చెందిన ఓ కిలేడీ ఏకంగా 30 మందిని మనువాడి.31 వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో దొరికిపోయింది.దీంతో ఆ కిలేడీ బండారం మొత్తం బయటపడింది.

ఇది విన్న పోలీసులు, మరియు స్థానికులు షాక్ కు గురయ్యారు.రాజస్థాన్ లో ఈ పెళ్లి ముఠాను అరెస్టు చేసిన పోలీసులు, మధ్యప్రదేశ్ లో దొంగ పెళ్లి కూతురును అరెస్టు చేశారు.

పెళ్లి కోసం వెయిట్ చేసే వ్యక్తులను టార్గెట్ గా చేసుకున్న ఈ కిలేడీలు వారికి మ్యారేజ్ బ్రోకర్లతో వల వేస్తున్నారు.వారు బ్రోకర్లతో కలిసి వారిని మనువాడుతున్నారు.

తర్వాత కొన్ని రోజులకు వారిని మోసం చేసి వారి వద్ద ఉన్న బంగారం, నగలతో ఉడాయిస్తున్నారు.రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు చెందిన ప్రకాశ్ చంద్ర భట్ అనే వ్యక్తికి గతేడాది వివాహం జరిగింది.

అతడికి పెళ్లిళ్ల బ్రోకర్ పరేష్ జైన్ అనే వ్యక్తి పెళ్లి చేశాడు.అతడు ఆ పెళ్లి చేసేందుకు గాను ప్రకాశ్ చంద్ర నుంచి రూ.5 లక్షల కమిషన్ తీసుకున్నాడు.అతడికి రీనా భట్ అనే యువతితో వివాహం చేశాడు.

పెళ్లయిన వారం రోజులకు రీనా ఠాకూర్ తన ముఠాతో కలిసి ప్రకాశ్ ను చితకబాది అక్కడి నుంచి పారిపోయింది.వీరు నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి దొంగ పెళ్లిళ్లు చేసుకుంటున్నారని పోలీసులు తెలియజేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube