అతడి ముఖం జన్మలో చూడను.. కియారా కీలక వ్యాఖ్యలు..?

తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరనే సంగతి తెలిసిందే.

వినయ విధేయ రామ సినిమా తరువాత తెలుగులో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని కియారా శంకర్ రామ్ చరణ్ సినిమాతో పాటు, జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలలో హీరోయిన్ గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతున్నా అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం కియారా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.తాజాగా మీడియాతో మాట్లాడిన కియారా అద్వానీ తన సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.

బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో రిలేషన్ షిప్ గురించి స్పందించిన కియారా తనకు, సిద్దార్థ్ కు మధ్య ఉన్న వ్యవహారం విషయంలో ఎటువంటి దాపరికాలు లేవని అన్నారు.

జనవరి నెలలో సిద్దార్థ తో కలిసి మాల్దీవులకు వెళ్లానని.గ్రాండ్ గా, ఫన్నీగా నూతన సంవత్సరాన్ని మొదలుపెట్టానని కియారా తెలిపారు.అయితే ప్రియుడు మోసగిస్తే ఏం చేస్తారని కియారాకు ప్రశ్న ఎదురు కాగా జన్మలో అతని ముఖం చూడనని.

Advertisement

అతను చేసిన మోసాన్ని తాను ఎప్పటికీ మరిచిపోనని ఆమె తెలిపారు.ఫ్యూచర్ లో ఆ వ్యక్తితో ఎటువంటి రిలేషన్ పెట్టుకోనని కియారా అద్వానీ వెల్లడించారు.మోసం చేసిన వ్యక్తి విషయంలో తాను కఠినంగా వ్యవహరిస్తానని కియారా చెప్పకనే చెప్పేశారు.

గతేడాది కియారా నటించిన నాలుగు సినిమాలు విడుదల కాగా ఈ ఏడాది కియారా నటించబోయే మూడు సినిమాలు విడుదల కానున్నాయి.త్వరలో కియారా కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్ కాకపోయి ఉంటే మాత్రం కియారా టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో బిజీ అయ్యేవారని చెప్పవచ్చు.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు