ఇప్పటికీ తను ప్రేమించిన హీరోని మర్చిపోలేకపోతున్నా ఖుష్బూ...

తెలుగు లో చాలా సినిమాల్లో హీరోయిన్ గా కనిపించి ఆ తర్వాత మదర్ గా కూడా చాలా సినిమాల్లో నటించి మెప్పించిన నటి ఖుష్బూ( Khushboo ) ఈమె దక్షిణాదిలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందారు.

ఖుష్బూ పేరు అప్పట్లో ఒక సంచలనం.

ఇక 90వ దశకంలో తన అందం, అభినయంతో స్టార్‌ హీరోయిన్‌గా క్రేజ్‌ తెచ్చుకుంది.ఆమె బాలనటిగా కెరీర్‌ మొదలు పెట్టి.

ఆ తర్వాత టాప్‌ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.ఇక తెలుగు, హిందీ, తమిళ్‌భాషల్లో దాదాపుగా 200కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన ఖుష్బూ ప్రస్తుతం సహాయ నటిగా రాణిస్తూ రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

కుష్బూ చైల్డ్ ఆర్టిస్టు( Kushboo child artist )గా కేరీర్ మొదలు 1991లో వచ్చిన చిన్నతంబి చిత్రంతో హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.హీరోయిన్ గా తన కెరీర్ ప్రభు( Prabhu ) తో మొదలు పెట్టగా ఆ సినిమా బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది.

Advertisement

ఇక తెలుగులోనూ ఈ సినిమాను వెంకటేశ్‌( Venkatesh ) హీరోగా చంటిగా రీమేక్‌ చేశారు.చంటి సినిమా( Chanti movie ) సంచలన విజయం కైవసం చేసుకుంది.

అయితే హీరో ప్రభు గూర్చి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో సహాయ నటుడిగా రాణిస్తున్న ప్రభు.

గతంలో హీరోగా, సెకండ్ హీరోగా అనేక సినిమాల్లో నటించి విజయాలు అందిపుచ్చుకున్నారు.

ఇక లెజండరీ స్టార్ హీరో శివాజీ గణేశన్ ( Shivaji Ganesan ) అబ్బాయిగా సినిమాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ స్వతహాగా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు.ఇక గతంలో కుష్బూ -ప్రభు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.ఇక 1991 చిన్న తంబి సినిమాలో ప్రభు- ఖుష్బూ జంటగా నటించినప్పుడు.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?

వీరిద్దరిమధ్య ప్రేమ చిగురించింది దాంతో 1993లో పెళ్లి కూడా చేసుకున్నారు.అయితే అప్పటికే ప్రభుకు పెళ్లి కావడం పెద్ద షాకిచ్చే అంశం.

Advertisement

అయితే వీరిద్దరి పెళ్లికి ప్రభు తండ్రి శివాజీ గణేశన్‌ అలాగే ప్రభు భార్య గొడవ చేయడంతో 4 నెలలకే కుష్బూ - ప్రభు విడిపోయారు.

దాదాపుగా ఈ సంఘటన జరిగి 30 ఏళ్ళు దాటుతున్నప్పటికీ కుష్బూ కొన్ని జ్ఞాపకాలను మరచిపోలేక ప్రభు కోసం నా గుండె ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుంది అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట్లో తెగ చెక్కర్లు కొడుతుంది .కుష్బూ తన పోస్ట్ లో " చిన్నతంబి సినిమా రిలీజై నేటి కి 32 ఏళ్లు గడిచాయి.ఈ సినిమా చేసి అప్పుడే 32 ఏళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నాను.

నాపై కురిపించిన ఆ నాటి ప్రేమకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను వాసు, ప్రభు కోసం నా గుండె ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుంది.

అలాగే మనసులను కదిలించెలా సంగీతాన్ని అందించినటువంటి ఇళయరాజా సర్‌కు. కె.బాలు సార్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.ఇక సినిమాలో నందిని గా నా పాత్ర ప్రతి ఒక్కరి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయెలా చేసిన అందరికి ధన్యవాదాలు’ అంటూ ఎమోషల్ పోస్ట్ చేసారు.

దీంతో ఫాన్స్ , అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తాజా వార్తలు