యశ్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌ ల కాంబో మల్టీ స్టారర్‌ పై నిర్మాత క్లారిటీ

కన్నడ సినిమా కేజీఎఫ్ తో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న హంబుల్‌ నిర్మాణ సంస్థ వరుసగా వేరు వేరు భాషల్లో పెద్ద పెద్ద సినిమాలను నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సలార్‌ ను హంబుల్ వారు నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా భారీ గా ఖర్చు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.సినిమా వసూళ్ల విషయం తో సంబంధం లేకుండా వందల కోట్ల ను హంబుల్‌ వారు ఖర్చు చేస్తూ ఇండియాస్ బిగ్గెస్ట్‌ నిర్మాణ సంస్థగా పేరు దక్కించుకున్న విషయం తెల్సిందే.

Kgf Producers Want To Do A Big Multistar Movie With Ntr Prabhas And Yash Kgf ,

ఇక హంబుల్‌ నిర్మాణ సంస్థ వారు తాజాగా ఒక ఆసక్తికర ప్రకటన చేయడం జరిగింది.ఆ ప్రకటన అనుసారంగా హాలీవుడ్‌ రేంజ్ లో ఒక భారీ మల్టీ స్టారర్ సినిమాను చేయబోతున్నారట.

హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ సినిమాల్లోని ముఖ్య పాత్రలను కలిపి ఒక సినిమాగా చేస్తూ ఉంటారు.అలా హాలీవుడ్‌ లో వచ్చిన కొన్ని సినిమాలు ఎంతటి విజయాన్ని సొంతం చేసుకున్నాయో తెల్సిందే.

Advertisement

ఇప్పుడు అదే తరహాలో ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమాల యొక్క పాత్రలను కూడా కలిపి ఒక సినిమాను చేయబోతున్నట్లుగా హంబుల్ నిర్మాతలు ప్రకటించారు.కేజీఎఫ్ లోని రాఖీ బాయ్‌.

సలార్‌ సినిమాలోని హీరో పాత్ర మరియు ఎన్టీఆర్‌ 31 సినిమాలోని హీరో పాత్ర తో కలిపి ఒక కథను అల్లి ఆ ముగ్గురితో ఒక భారీ మల్టీ స్టారర్ ను ప్లాన్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.అదే కనుక నిజం అయితే ఖచ్చితంగా అదో అందర్జాతీయ సినిమా అవ్వడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 ప్రస్తుతం సలార్ ను చేస్తున్న ప్రశాంత్‌ నీల్‌ వచ్చే ఏడాది ఎన్టీఆర్‌ 31 తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు దీన్ని తింటే ఏమవుతుందో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు