Keerthy Suresh : హీరోయిన్ కీర్తి సురేష్ జాతకం ఇంత ఘోరమా.. చెల్లి రోల్ లో నటిస్తే సినిమా ఫ్లాపా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) నటించిన భోళాశంకర్ సినిమా విడుదల అయ్యి డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు భావించారు.

 Keerthy Suresh Sister Role Chiranjeevi Rajinikanth Movies Flop-TeluguStop.com

ఊహించని విధంగా ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి అనేక రకాల కారణాలు వినిపిస్తున్నాయి.

ఈ మూవీకి సంబందించి ఇప్పుడు మరో విషయం హాట్ టాపిక్ అవుతోంది.ఈ ఫ్లాప్‌కి హీరోయిన్ కీర్తి సురేశ్( Keerthy Suresh ) కూడా ఒక కారణమని అంటున్నారు.

స్టార్ హీరోయిన్ అయిన కీర్తి సురేష్ ఒకవైపు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూనే మరొకవైపు స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్లకు చెల్లెలు క్యారెక్టర్ లలో కూడా నటిస్తోంది.

Telugu Annaatthe, Bhola Shankar, Chiranjeevi, Keerthy Suresh, Pedanna, Rajinikan

ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలు క్యారెక్టర్( Chiranjeevi Sister Role ) లో నటించిన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా విడుదలకు ముందే చాలామంది కీర్తి సురేష్ చెల్లెలిగా నటిస్తోంది అంటే ఆ సినిమా ఫ్లాప్ అవడం గ్యారెంటీ అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.ముందుగా అనుకున్నట్టుగానే జరిగింది.

కీర్తి సురేశ్ చెల్లిగా చేయడం చిరుకి కలిసిరానట్లే, సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు అస్సలు కలిసిరాలేదు.సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన అన్నాత్తే( Annaatthe ) లో కిర్తి సురేష్ చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే.

దాంతో ఆ సినిమా ఘోరమైన డిజాస్టర్ ను చవిచూసింది.తాజాగా జైలర్ సినిమా( Jailer Movie )తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు రజినీకాంత్( Rajinikanth ).

Telugu Annaatthe, Bhola Shankar, Chiranjeevi, Keerthy Suresh, Pedanna, Rajinikan

మొత్తానికి కీర్తి సురేష్ హీరోలకు చెల్లెలుగా నటిస్తే ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం గ్యారెంటీ అన్న వాదన ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తోంది.కీర్తి సురేష్ హీరోలకు చెల్లెలుగా( Heroes Sister Role ) నటిస్తుంది అంటే ఆ హీరోల సినిమాలకు ముప్పే అని అంటున్నారు.అందుకు భోళా శంకర్,అన్నాత్తే సినిమాలు చక్కటి ఉదాహరణలుగా చెప్పుకొస్తున్నారు.అంతేకాకుండా భోళా శంకర్ సినిమాకు ముందు ఈ విషయం గురించి ప్రస్తావన తీసుకువచ్చారు.ఇప్పుడు అదే విషయం మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube