ఇప్పటి వరకు ఏ సినిమాకు జరగనిది ‘పెంగ్విన్‌’ విషయంలో జరిగింది

కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించిన పెంగ్విన్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాను థియేటర్లలో ప్రేక్షకులు చూడాలనుకున్నారు.

కాని థియేటర్లు మూసి ఉన్న కారణంగా ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

పెంగ్విన్‌ సినిమా టీజర్‌ మరియు ట్రైలర్‌ సినిమాపై అంచనాలు ఆకాశానికి పెంచాయి.కీర్తి సురేష్‌ తన కొడుకు కోసం చేసే పోరాటమే ఈ సినిమా.

ఈ సినిమాలో విలన్‌ జోకర్‌ మాస్క్‌లో ఉంటాడు.ఇప్పటి వరకు ఆ మాస్క్‌ వెనుక ఉన్నది ఎవరు అనే విషయంపై చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement
Latest Update Penguin About Role Of Villan, Keerthi Suresh Penguin, OTT, Corona

ఇక్కడ చెప్పుకోవల్సిన విషయం ఏంటీ అంటే ఈ సినిమాలో విలన్‌గా నటించింది ఎవరు అనేది ఒక్క దర్శకుడికి తప్ప మరెవ్వరికి తెలియదట.ఆయన ఇంటి నుండి వచ్చే సమయంలోనే మాస్క్‌ వేసుకోవడం మాస్క్‌ తియకుండానే షూటింగ్‌ చేయడం వెళ్లి పోవడం చేశాడట.

Latest Update Penguin About Role Of Villan, Keerthi Suresh Penguin, Ott, Corona

షూటింగ్‌ జరుగుతున్న అన్ని రోజులు కూడా యూనిట్‌ సభ్యులు ఆ విలన్‌ ఎవరై ఉంటారా అనే విషయాన్ని గెస్‌ చేసేందుకు ప్రయత్నించారట.కాని ఎవరు కూడా ఆ విలన్‌ ఎవరు అనే విషయాన్ని గుర్తించలేదు.ఇప్పటి వరకు కూడా యూనిట్‌ సభ్యులకు ఆ విలన్‌ ఎవరో తెలియదు.

ప్రేక్షకులతో పాటు యూనిట్‌ సభ్యులు కూడా ఆ విలన్‌ ఎవరు అనే విషయాన్ని సినిమా చూసే తెలుసుకోవాల్సి ఉంది.ఇలా ఇప్పటి వరకు ఏ సినిమా విషయంలో జరిగి ఉండదు కదా.! .

వృద్ధాప్యాన్ని వాయిదా వేసే అద్భుతమైన పానీయం
Advertisement

తాజా వార్తలు