విరాట్‌ కోహ్లి అయితే నాకేంటి అని రెచ్చగొడుతున్న బౌలర్!

క్రికెట్ అభిమానులకు వెస్టిండీస్ బౌలర్ అయిన కెస్రిక్‌ విలియమ్స్‌ ను ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు.

అతనెవరో మీకు తెలియకపోతే టాప్ 10 క్రికెట్ రివెంజ్ మోమెంట్స్ అని చూడండి మనోడి ప్రాబ్లం ఏంటో మీకు తెలిసిపోతుంది.

అయితే ఇతడు తాజాగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

Kesrick Williams Latest Comments On Virat Kohli, Virat Kohil, Kesrick Williams,

ఇక విషయం ఏంటంటే మనోడు ఫస్ట్‌పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లి టాలెంటెడ్‌ ప్లేయర్‌.అనడంలో ఎటువంటి సందేహం లేదు.

అతడు మ్యాచ్ లో ఉన్నాడంటే చాలామందికి నిద్రపట్టకపోవచ్చు.అయితే కోహ్లి గురించి నాకు ఎటువంటి ఆందోళన కాని అతను ఉన్నాడనే ఆలోచన కాని ఎప్పుడు రాదు.

Advertisement

నాకు అటువంటి భయం లేదు.ఇక కోహ్లిని ఔట్‌ చేసే విషయానికి వస్తే నాకు ఒక్క బాల్‌ చాలు, అతనిపై పైచేయి సాధించడానికి అంటూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

అక్కడితో ఆగకుండా కోహ్లి వంటి ప్లేయర్‌కు సరైన పోటీ ఇవ్వడానికి నేను సమాయత్తమవుతా అని కెస్రిక్‌ విలియమ్స్‌ తెలిపాడు.మరి దీని పై మన కోహ్లీ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు