అధికారం కోసం కేసీఆర్ ఎన్ని అబద్దాలైనా ఆడతారు..పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:నిత్యం పచ్చి అబద్ధాలాడే కేసీఆర్ కుటుంబం అధికారం కోసం దేనికైనా తెగిస్తారని,వారికితగిన సమయంలో తగిన బుద్ధి చెప్పాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.

శుక్రవారం మహా పాదయాత్రలో భాగంగా 19వ రోజు సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూర్ (ఎస్)మండలం తుమ్మల పెన్ పహాడ్ బొట్యతండా, పొట్టిసూర్యతండా లలోపర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాయమాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప,కొత్తగా చేసిన అభివృద్ధి పనులు కనిపించడం లేదన్నారు.

KCR Will Play Any Number Of Lies For Power..Patel Ramesh Reddy, Patel Ramesh Red

ఇప్పుడు ప్రభుత్వ భూములు అమ్ముతున్నరని,మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని కూడా అమ్ముకుంటారని ఆరోపించారు.తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చిన జగదీష్ రెడ్డి ఏనాడైనా గ్రామాలలోకి వచ్చారా అని ప్రశ్నించారు.

గ్రామాలలో పేద,బడుగు,బలహీన వర్గాలకు కొత్తగా రేషన్ కార్డులు,పెన్షన్లు,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందుతున్నాయా అని అన్నారు.ఈ కార్యక్రమం లో సిహెచ్.

Advertisement

గోపాల్ రెడ్డి,రమణారెడ్డి, నామ ప్రవీణ్,పానుగంటి మల్లారెడ్డి,స్వామి నాయుడు,అరవింద్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి,గంగయ్య, నరేష్ యాదవ్,సత్యం, లింగయ్య,గుర్వయ్య, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు దీన్ని తింటే ఏమవుతుందో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు