కేసీఆర్ లో మునుగోడు టెన్ష‌న్..! ఆ నేత‌ను వ్య‌తిరేకిస్తుండ‌టంతో..

రాష్ట్రంలో మునుగోడు అన్ని పార్టీల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.గ‌తంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నాయి.

 Kcr Under Pressure In Choosing Candidate For Munugodu By Elections Details, Cm K-TeluguStop.com

ఇక తొంద‌ర్లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నుండ‌టంతో ఈ ఎన్నిక ప్రామాణికం కానుంది.ఈ నేప‌థ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ కూడా ఎప్పుడూ లేనంత‌గా టైమ్ కేటాయిస్తూ చ‌ర్చిస్తున్నార‌ట‌.

ప‌క్కా ప్లాన్ వేస్తూ నేత‌లో మంత‌నాలు జ‌రుపుతున్నార‌ట‌.అయితే మునుగోడు ఉప ఎన్నిక కేసీఆర్ ని టెన్ష‌న్ పెడుతోంద‌ట‌.

ఈ నెల 20న మునుగోడులో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు.అయితే ఒకవైపేమో అభ్యర్థి ఎంపిక విషయంలో కేసీఆర్ కు ద్వితీయశ్రేణి నేతల సహాయనిరాకరణ క‌నిపిస్తోంది.

దీంతో ద్వితీయశ్రేణి నేతల సాయం లేకుండా ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమని తేల్చిన రిపోర్టులు.మరోవైపు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతోందనే రిపోర్టుల‌తో కంగారు ప‌డుతున్నార‌ట‌.ఎందుకంటే ఈ ఎన్నిక ప్ర‌భుత్వానికి అత్య‌స‌రం.

తానే స్వ‌యంగా రంగంలోకి.

ఇక గ‌తంలో చేసిన‌ట్టు కాకుండా ఈ సారి సీఎం కేసీఆరే స్వ‌యంగా రంగంలోకి దిగుతున్నారు.ఇప్పటి వరకు జరిగిన ఉపఎన్నికల్లో ఎక్కడో ఒకచోట బహిరంగ సభలో మాట్లాడ‌గా.

మిగిలిన ప్రచారమంతా మంత్రులు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు చేసుకునేవారు.కానీ మునుగోడులో అలావదిలేస్తే న‌ష్టం త‌ప్ప‌ద‌ని భావిస్తున్నార‌ట‌.

ముఖ్యంగా దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీకి జ‌రిగిన న‌ష్టాల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.అందుకే మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో తానే స్వ‌యంగా పాల్గొనాల్సిందే డిసైడ్ అయిన‌ట్లు తెలుస్తోంది.

Telugu Cm Kcr, Kcr Pressure, Munugodu-Political

ఈ విషయంలో ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలు, ఎంపీలతో కేసీఆర్ రెండుసార్లు సమావేశాలు నిర్వహించారు.20న బహిరంగ సభలో జన సమీకరణ జనాల స్పందనను బట్టి మరిన్ని బహిరంగ సభలను పెట్టాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.

అయితే మునుగోడు ఉప ఎన్నికలో అభ్య‌ర్థిగా కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని పోటీ చేయించాలని కేసీఆర్ అనుకుంటున్నార‌ట‌.అయితే ఇందుకు భిన్నంగా ద్వితీయ శ్రేణి నేతలు బలంగా వ్యతిరేకిస్తున్నార‌ట‌.కేసీఆర్ బుజ్జ‌గించినా విన‌టం లేద‌ట‌.దీంతో ఇప్పుడు అభ్య‌ర్థిని మార్చాలా.

లేక వ్య‌తిరేకుల‌కు న‌చ్చ‌చెప్పి ముందుకు వెళ్లాలో అర్థం కావ‌డం లేద‌ట‌.ఈ విష‌యాన్ని అంత తేలిక‌గా తీసుకుంటే న‌ష్టం త‌ప్ప‌ద‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌.

ఇక నియోజకవర్గంలో ఇంతమంది వ్యతిరేకిస్తున్న ప్రభాకరరెడ్డిని అభ్యర్థిగా ప్ర‌క‌టిస్తే.కింది స్థాయి నేత‌లు ప‌నిచేస్తారోలేదో న‌ని టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube