సాగర్ లో కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకు కేసీఆర్ రచించిన వ్యూహం ఇదే?

తెలంగాణలో వరుస ఎన్నికలు జరుగుతున్న వేళ మరో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోంది.

అయితే తెలంగాణ మొత్తం కాంగ్రెస్ సత్తా చాటే పరిస్థితి లేకున్నా నాగార్జున సాగర్ లో పరిస్థితి కాస్త భిన్నంగా ఉండే అవకాశం ఉంది.

ఎందుకంటే నాగార్జున సాగర్ అనేది కాంగ్రెస్ కంచుకోట అనే విషయం కేసీఆర్ కు తెలియనిది కాదు.అందుకే కాంగ్రెస్ ప్రధాన పోటీదారు అని భావించిన కేసీఆర్ కాంగ్రెస్ కు చెక్ పెట్టడానికి ఒక పకడ్బంధీ వ్యూహానికి తెరతీసాడు.

అయితే నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ కు లాభించే అంశం నోముల నర్సింహయ్య మృతి చెందిన సానుభూతి ఒక అంశమైతే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపొందడంతో టీఆర్ఎస్ అనుకూల వాతావరణం ఉంది.అయితే ఇప్పటికే దీని పట్ల ఒక వ్యూహాన్ని అమలు చేసినా కాంగ్రెస్ ను నిలువరిస్తేనే నాగార్జున సాగర్ లో గెలవవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు.

అయితే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై విమర్శనాస్త్రాలు కురిపించి కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని మరల జానారెడ్డి గెలిస్తే అప్పటి పరిస్థితిలోనే నాగార్జున సాగర్ ఉంటుందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అవకాశం ఉంది.మరి నాగార్జున సాగర్ ఎన్నికల్లో ఎవరు సత్తా చాటనున్నారో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

Advertisement
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

తాజా వార్తలు