పవన్‌కు టైం ఇవ్వని కేసీఆర్‌

తెలంగాణలో గత నెల రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె విరమణకు తాను ప్రయత్నిస్తాను అంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించిన విషయం తెల్సిందే.

సీఎం కేసీఆర్‌తో ఈ విషయమై మాట్లాడేందుకు తాను కేసీఆర్‌తో భేటీ అవుతాను అంటూ పవన్‌ కళ్యాణ్‌ చెప్పడంతో ఆర్టీసీ కార్మికుల్లో ఏదో కొంత నమ్మకం అనేది ఏర్పడింది.

కాని పవన్‌ కళ్యాణ్‌ తో భేటీ అయ్యేందుకు సీఎం కేసీఆర్‌ కాని సంబంధిత మంత్రులు లేదంటే ప్రభుత్వంకు చెందిన ఏ ఒక్కరు కూడా సిద్దంగా లేరట.ఈ విషయాన్ని స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు.

Kcr No Oppintment Given To Pawan Kalyan-పవన్‌కు టైం ఇవ�

ఆర్టీసీ సమ్మె విషయమై మాట్లాడేందుకు నేను మరియు జనసేన పార్టీ నాయకులు కొందరు ప్రభుత్వ పెద్దలతో మరియు సీఎం కేసీఆర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించాం.కాని కేసీఆర్‌ గారు ఆర్టీసీ విషయమై మాట్లాడేందుకు అస్సలు సమయం ఇవ్వడం లేదు.

ఈ విషయమై వారిని కలిసేందుకు ప్రయత్నించగా వారు ఆసక్తి చూపడం లేదు.అసలు ప్రభుత్వంకు చెందిన ఏ ఒక్కరు కూడా ఈ విషయమై మాకు సమయం కేటాయించేందుకు ఒప్పుకోలేదు అంటూ పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నాడు.

Advertisement

మూడవ తారీకున భవన నిర్మాణ కార్మికుల కోసం లాంగ్‌ మార్చ్‌ను వైజాగ్‌లో నిర్వహించబోతున్నాం.అందుకు సంబంధించి వైజాగ్‌ వెళ్తున్న కారణంగా వచ్చిన తర్వాత మళ్లీ కేసీఆర్‌ గారితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తానంటూ చెప్పుకొచ్చాడు.

అప్పుడైనా కేసీఆర్‌ టైం ఇస్తాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు