బీజేపీతో కేసీఆర్ చీకటి ఒప్పందం... సాక్ష్యాలు బయటపెట్టిన ఉత్తమ్

తెలంగాణలో ఒకప్పుడు ఒక్క వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ తన స్వంత తప్పిదాలతో ప్రజల్లో పలుచబడిందని చెప్పుకోవచ్చు.

ప్రజల సమస్యలపై పోరాడడం మానేసి పార్టీ ప్రతిష్టను తాకట్టు పెడుతూ స్వంత ప్రయోజనాలకు కాంగ్రెస్ నేతలు ప్రాధాన్యం ఇస్తుండడంతో కాంగ్రెస్ ప్రజలు తమను పట్టించుకోకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో రుచి చూపించారు.

ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయానికొస్తే కాంగ్రెస్ కు ఈ ఎన్నిక ప్రతిష్టత్మాకంగా మారిన విషయం తెలిసిందే.కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న నాగార్జున సాగర్ లో కూడా కాంగ్రెస్ ఓడిపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రతిష్ట మసకబారుతుందనే చెప్పవచ్చు.

KCR Dark Deal With BJP Evidence Is The Best BJP, UTTAM KUMAR REDDY, Ap Potics ,

అయితే ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అక్కడ జోరుగా ప్రచారాన్ని ప్రారంభించారు.అయితే ఈ సందర్బంగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

బీజేపీతో కేసీఆర్ కు చీకటి ఒప్పందం కుదిరిందని, అందుకే నాగార్జున సాగర్ ఎన్నికలో బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టిందని, విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచుతున్నా ఎన్నికల సంఘం చూస్తూ ఉండడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ఉత్తమ్ దుయ్యబట్టారు.తెర వెనుక ఒప్పందాలు వలనే కేసీఆర్ విచిత్ర మైన నిర్ణయాలు తీసుకంతున్నాడని, నాగార్జున సాగర్ ఎన్నికలో కాంగ్రెస్ కు మద్దతు పలికి ప్రజలు కేసీఆర్ కు బుద్ధి చెబుతారని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.

Advertisement
పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

తాజా వార్తలు