తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్( Former CM KCR ) కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( CM Bhatti Vikramarka ) కౌంటర్ ఇచ్చారు.కేసీఆర్ వాస్తవాలు కప్పిపుచ్చి అబద్ధాలు మాట్లాడారని చెప్పారు.
తెలంగాణలో నెలకొన్న అనేక సమస్యలకు బీఆర్ఎస్ పార్టీనే కారణమని భట్టి ఆరోపించారు.కేసీఆర్ వలన విద్యుత్ రంగం కష్టాల్లో ఉందన్న ఆయన రూ.19,431 కోట్లు డిస్కమ్స్ కి బకాయిలు ఉన్నాయని తెలిపారు.మొత్తం రూ.1,10,690 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు.విద్యుత్ భారం కేసీఆర్ కుటుంబం కట్టదన్న భట్టి ప్రజలపై భారం పడుతుందని వెల్లడించారు.
అదేవిధంగా ఎన్టీపీసీ రాకపోవడానికి కూడా కేసీఆర్ పాపమే కారణమని ఆయన ఆరోపించారు.ఇప్పుడు ఎన్టీపీసీ మొదలు పెడితే ఐదేళ్లు పడుతుందన్నారు.
పదేళ్ల పాలనలో కేసీఆర్ ఏం చేశారన్న భట్టి ఎన్టీపీసీని అప్పుడే కేసీఆర్ ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు.