కేసీఆర్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది..: వైఎస్ షర్మిల

కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీతో వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల భేటీ ముగిసింది.గత రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్న షర్మిల దంపతులు ఇవాళ సోనియా గాంధీతో సమావేశం అయ్యారు.

 Kcr Countdown Has Started..: Ys Sharmila-TeluguStop.com

అయితే ఈ సమావేశంలో కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.సమావేశం ముగిసిన అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ సోనియాగాంధీని కలిసినట్లు చెప్పారు.

తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకే షర్మిల పోరాటం ఉంటుందని తెలిపారు.తెలంగాణలో సీఎం కేసీఆర్ కౌంట్ డౌన్ ప్రారంభం అయిందని వెల్లడించారు.

అయితే వైఎస్ఆర్ టీపీ విలీనంపై షర్మిల ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని తెలుస్తోంది.దీనిపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు విలీనం ప్రతిపాదన లేని సమయంలో కూడా షర్మిల పాలేరు నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం షర్మిల సేవలను ఏపీలో వినియోగించుకోవాలని చెబుతున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే పాలేరు నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బరిలోకి దింపే యోచనలో ఉన్నారు.ఒకవేళ షర్మిల పోటీ తెలంగాణలో కనుక అనివార్యం అయితే ఆమెను సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బరిలో దింపాలని టీ కాంగ్రెస్ యోచిస్తుంది.

కాగా వైఎస్ఆర్ టీపీ విలీనంపై తెలంగాణ కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube