కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ “భారత్ జోడో” పాదయాత్ర తెలంగాణలో జరుగుతుంది.ఆరో రోజు జరుగుతున్న యాత్రలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీతో పొత్తు ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.అదేవిధంగా కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసుకున్న తమకేమీ నష్టం వాటిల్లదని తెలిపారు.
కేసీఆర్ అంతర్జాతీయ పార్టీ స్థాపించి చైనాలో కూడా పోటీ చేయొచ్చని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంకా ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో డబ్బులు ఎక్కడ నుండి.
వచ్చాయో.? అనేదానిపై చర్చించాలని తెలిపారు.టిఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీలు దోచుకునే పనిలో ఉన్నాయని విమర్శల వర్షం కురిపించారు.మోడీ హయాంలో వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సంస్థలు కూడా… ప్రభుత్వాల చేతిలో బందీలుగా మారినట్లు పేర్కొన్నారు.