అయ్యో కౌశిక్ ! ఎన్నికలు అయ్యేంత వరకు ఇంతేనా ?

ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ వ్యవహారంలో అనూహ్యంగా హుజురాబాద్ కీలకనేత పాడి కౌశిక్ రెడ్డి ని టిఆర్ఎస్ లో చేర్చుకొని ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు టిఆర్ఎస్ మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేసింది.

అంతేకాదు ఈ ఫైలును గవర్నర్ కార్యాలయానికి పంపించింది.

రేపు మాకు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా గవర్నర్ కార్యాలయం ప్రకటిస్తుందని ఆశగా కౌశిక్ అనుచరుల తో పాటు, టిఆర్ఎస్ ఎదురుచస్తుండగా,  గవర్నర్ కార్యాలయం మాత్రం ఈ ఫైల్ ను పక్కన పెట్టింది.పాడి కౌశిక్ రెడ్డి ని ఎమ్మెల్సీ గా ఎంపిక చేయడంలో తనకు అనేక అనుమానాలు ఉన్నాయని, అవన్నీ తీరిన తరువాత ఆమోదముద్ర వేస్తాము అన్నట్లుగా గవర్నర్ వ్యవహరించడం , అలాగే ఆయనను సేవా కోటా కింద ఎమ్మెల్సీగా ఎంపిక చేయాల్సి ఉండటంతో పాటు , ఆయనపై ఉన్న కేసులు తదితర వ్యవహారాలతో గవర్నర్ తమిళ సై ఈ ఫైల్ ను పక్కన పెట్టారు.

అసలు ఈ పరిణామాలు టిఆర్ఎస్ ముందుగా ఊహించలేకపోయింది.కౌశిక్ రెడ్డికి పదవి దక్కితే ఆయన మరింత ఉత్సాహంగా హుజూరాబాద్ లో టిఆర్ఎస్ గెలుపు కోసం పని చేస్తారని , రాజేందర్ కు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని, టిఆర్ఎస్ భావించింది.

కానీ ఆ ఫైలును మాత్రం ఇప్పటి వరకు గవర్నర్ పట్టించుకోలేదు.ఇక ఇప్పుడు ఉప ఎన్నికల షెడ్యూలు కూడా ప్రకటించడంతో ఈ ఎన్నికల తంతు ముగిసే వరకు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అయ్యే అవకాశం కనిపించడం లేదు.

Advertisement

ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత కౌశిక్ రెడ్డి ని ఎమ్మెల్సీగా ప్రకటించినా, టిఆర్ఎస్ కు పెద్ద కలిసి వచ్చేది ఏమి లేదు. 

దీంతో టిఆర్ఎస్ ముందస్తుగా వేసుకున్న వ్యూహం గవర్నర్ ద్వారా ఈ విధంగా బెడ్స్ కొట్టడం అటు కౌశిక్ వర్గీయులలోను, టిఆర్ఎస్ నేతల్లోనూ తీవ్ర అసంతృప్తి ని రాజేస్తున్నాయి.బహుశా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కౌశిక్ రెడ్డి ని ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ, గవర్నర్ కార్యాలయం ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.ఏదిఏమైనా కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్సీ పదవి ఇప్పటికిప్పుడు దక్కకపోవడం ఈటెల రాజేందర్ పెద్ద ఊరట గానే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు