తెలుగులో తక్కువ సినిమాలే చేసినా హీరో కార్తికేయకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కింది.ఆర్‌ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ లో కార్తికేయ పాపులారిటీని సంపాదించుకున్నారు.
కథ నచ్చితే విలన్ రోల్స్ లో నటించడానికి కూడా ఈ హీరో ఆసక్తి చూపిస్తున్నారు.ఈ హీరో విలన్ రోల్ లో నటించిన వలిమై రేపు థియేటర్లలో రిలీజ్ కానుంది.
అజిత్ ఈ సినిమాలో హీరోగా నటించగా తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో థియేటర్లలో వలిమై రిలీజ్ కానుంది.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కార్తికేయ తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు.
మ్యారేజ్ కు ముందు భార్య తరపు బంధువులు తనను చిన్నపిల్లాడిలా చూసేవారని కార్తికేయ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం తనను పెద్దమనిషిలా చూస్తున్నారని పెళ్లి తర్వాత వచ్చిన మార్పు ఇదేనని కార్తికేయ కామెంట్లు చేశారు.
మ్యారీడ్ లైఫ్ లో బాధ్యత పెరిగిందని అనిపిస్తోందని కార్తికేయ వెల్లడించారు.
అయితే భార్య చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న వ్యక్తి కావడంతో లైఫ్ లో తేడాలు లేవని కార్తికేయ తెలిపారు.
భార్యతో ఎలాంటి గొడవలు లేవని హ్యాపీ అని కార్తికేయ చెప్పుకొచ్చారు.వలిమై కొరకు తాను బైక్ రైడింగ్ ను ప్రాక్టీస్ చేశానని కార్తికేయ అన్నారు.ఆర్ఎక్స్ 100 సినిమా వల్లే వలిమై సినిమాలో తనకు ఛాన్స్ దక్కిందని అజిత్ తనకు ఇచ్చిన సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయని కార్తికేయ పేర్కొన్నారు.
త్వరలో ఒక రేస్ బైక్ ను కొనుగోలు చేస్తానని కార్తికేయ వెల్లడించారు.వెబ్ సిరీస్ లలో ఆఫర్లు వచ్చినా కథలు నచ్చకపోవడంతో వాటిపై తాను ఆసక్తి చూపలేదని కార్తికేయ చెప్పుకొచ్చారు.కెరీర్ లో ఆర్ఎక్స్ 100 మినహా మరో బ్లాక్ బస్టర్ హిట్ లేని కార్తికేయ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.