కార్తీక మాసంలో తప్పక చేయాల్సిన పనులివే.! ఆ 8 పనులు మాత్రం అస్సలు చేయద్దు.! తప్పక తెలుసుకోండి!

కార్తీకముతో సమానమైన మాసము లేదు.గంగతో సమానమగు తీర్థము లేదు అని చెప్పబడినది.

తెల్లవారుజామునే నిద్రలేవడం, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్లలో స్నానం చేయడం, బోళాశంకరునికి నిత్యమూ రుద్రాభిషేకం చేయడం, నుదుట విభూతిని మెడలో రుద్రాక్షల్నీ- లేదా- తులసి పూసల్ని ధరించండం రోజుకి ఒక పూట మాత్రమే భుజించడం, ఉసిరిక చెట్టు నీడలో వనభోజనాలు చేయడం.ఒకటేమిటి? ఇలా ఎన్నెన్నో సంప్రదాయాలని మూటగట్టుకుని తెచ్చింది పవిత్రమైన ఈ కార్తీకమాసం.

Karthika Masam Significance And Importance

ఇలా తప్పక చేయాలి:

ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలా ప్రాప్తిస్తాయి.అయితే అలా రోజు చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ,సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ, సోమవారంరోజైనా నియమనిష్టల తో ఉపవాసం ఉండి,గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభిం చే పుణ్యఫలాన్ని వర్ణిం చడం తన వల్ల కాదని బ్రహ్మ చెప్పాడు.కార్తీక పౌర్ణమినాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేం చేయించి శివాలయంలో సమస్త పాపాలు భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతి వృత్తాలు, ఉదాహారణలను బట్టి తెలుసుకోవచ్చు.

Karthika Masam Significance And Importance

ఇలా అస్సలు చేయకూడదు:

ఉల్లి, వెల్లుల్లి, మధ్యం, మాంసం జోలికి పోరాదు.ఎవ్వరికీ ద్రోహం చేయరాదు.పాపపు ఆలోచనలు చేయకూడదు.

Advertisement
Karthika Masam Significance And Importance-కార్తీక మాసం�

దైవ దూషణ తగదు.దీపారాధనలకు తప్ప నువ్వుల నూనె ఇతరాత్ర అవసరాలకు ఉపయోగించరాదు.

మినుములు తినకూడదు.నలుగుపెట్టుకుని స్నానం చేయరాదు.

కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినరాదు.

తాజా వార్తలు