పెళ్లికి ముందు 'సైఫ్'కి కరీనా పెట్టిన షరతు ఏంటో తెలుసా?

జీవితంలో అన్ని బంధాల్లో వివాహబంధం అతి ముఖ్యమైనది.ఈ బంధం మనుషుల జీవితాన్నే మలుపులు తిప్పుతుంది.

వివాహ బంధం బలంగా ఉంటే ఆ కుటుంబం భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉంటుంది.లేని పక్షంలో భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.

Kareena Kapoore Restriction On Saif Ali Khan Before Marriage Saif Ali Khan, Kar

ఇద్దరి మధ్య పరస్పర అంగీకారం ఉంటే ఆ కుటుంబం పిల్లాపాపలతో చూడముచ్చటగా ఉంటుంది.అయితే అలా ఉండాలంటే భార్యాభర్తల్లో ఒకరి గురించి మరొకరికి పరస్పర అవగాహన అవసరం.అలా పెళ్లి తరువాత సంతోషంగా ఉన్న జంటల్లో కరీనా కపూర్ సైఫ్ అలీఖాన్ జంట కూడా ఒకటి.1980 సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన జన్మించిన కరీనాకపూర్ పుట్టినరోజు నేడు.ఈరోజు కరీనాకపూర్ 40వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటోంది.

సినీ కెరీర్ గా స్టార్ హీరోయిన్ గా కరీనా కపూర్ ఒక వెలుగు వెలిగింది.ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది.

Advertisement

ఎనిమిదేళ్ల క్రితం కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లి జరిగింది.వయస్సులో కరీనా కపూర్ కు, సైఫ్ అలీ ఖాన్ కు పదేళ్ల వ్యత్యాసం ఉంది.

అయితే ఇంత వ్యత్యాసం ఉన్నా వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం గురించి అప్పట్లో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ఒక సినిమా షుటింగ్ లో ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న సైఫ్ కరీనా తమ ప్రేమకు వయస్సు సమస్య కాదని భావించారు.

సైఫ్ కరీనా పేరును పచ్చబొట్టు వేయించుకోవడంతో వీరి ప్రేమ విషయం వెలుగులోకి వచ్చింది.అయితే కరీనా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను సైఫ్ కు ఒక షరతు పెట్టానని.

ఆ షరతుకు సైఫ్ అంగీకరించడం వల్లే తనను వివాహం చేసుకున్నానని అన్నారు.పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించి డబ్బులు సంపాదిస్తానని సైఫ్ కు చెప్పగా దానికి అతను అంగీకరించాడని దీంతో తమ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ బంధం వివాహ బంధంగా మారిందని కరీనా చెప్పుకొచ్చారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు