ప్రభాస్ ఫ్లాప్ సినిమా రీమేక్ తో కోట్లు కొల్లగొట్టిన హీరో

నిజాయితీగా ఏదైనా మంచి చేసినప్పుడే ఆ మనిషిని ప్రజలు మనస్ఫూర్తిగా అభిమానిస్తారు.

పబ్లిసిటీ స్టంట్స్ ద్వారా అభిమానం సంపాదించడం ఎవరితరం కాదు ప్రజలు ఎవరు నిజాయితీగా ఉన్నారో, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారో ఈజీగా తెలుసుకోగలుగుతారు.

అయితే ఒక యాక్టర్ ఎప్పుడూ జన్యూన్‌గా ప్రజలకు మంచి చేస్తూ మనసున్న మహారాజులాగా గుర్తింపు తెచ్చుకున్నాడు.అతడు ఓ కన్నడ నటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.

అతను మరెవరో కాదు పునీత్ రాజకుమార్ ( Puneeth Rajakumar )సోదరుడు శివ రాజ్‌కుమార్( Siva Rajkumar ).ఈ నటుడిని శివన్న అని ముద్దుగా పిలుచుకుంటారు.ఈరోజు అంటే జులై 12 శివన్న పుట్టినరోజు.

ఈ సందర్భంగా ఆయన సినిమా ఎలా వచ్చారో సేవా కార్యక్రమాలు ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం.దర్శక దిగ్గజం బాలచందర్ ( Balachander )ఒక మనిషిని చూసి అతడి సామర్థ్యాన్ని అంచనా వేసేవారు.

Advertisement

"ఈ వ్యక్తి గొప్ప నటుడు అవుతాడు/నటి అవుతుంది." అని అంటే అది ముమ్మాటికీ నిజమై తీరుతుంది.

ఓ రోజు ప్రముఖ కన్నడ నటుడు రాజ్‌కుమార్ తన కుమారుడు శివరాజ్ కుమార్‌ను సినిమా షూటింగ్ జరుగుతున్న స్టూడియోకు తీసుకెళ్లారు.బాలచందర్ శివన్నను పరిశీలనగా చూసారు ఆపై ఇతడిని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో జాయిన్ చేయిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.

రాజ్‌కుమార్ వెంటనే ఇండస్ట్రీలోకి కుమారుడిని తీసుకొచ్చారు.అప్పటి దాకా ఆడుతూ పాడుతూ హ్యాపీగా తిరిగిన శివన్న ఆరోజు నుంచి సినీ కెరీర్ పై ఫోకస్ పెట్టాడు.

గొప్ప కళాకారుడైన వెంపటి చిన సత్యం డ్యాన్స్ నేర్చుకున్నాడు.బాలచందర్ గారి మాటలతో ఆ ఇంట్లో వాతావరణమే మారిపోయింది, సత్యం గారి దగ్గర నాట్యం నేర్చుకున్నారు శివరాజ్ కుమార్.

ఎంతమంది చేరినా తెలంగాణ లో టీడీపీకి కష్టమేనా   ?  
స్టూడెంట్‌ను అద్దె ఇంటి నుంచి వెళ్లగొట్టిన కంపెనీ.. భారీ ఫైన్ విధించిన కోర్టు..

కంఠీరవ రాజ్ కుమార్ శివన్న, పునీత్ - ఇద్దరినీ తెలుగు దర్శకులతోనే మూవీ ఇండస్ట్రీకి పరిచయం చేయించారు.సింగీతం శ్రీనివాసరావు శివరాజ్ కుమార్ ఫస్ట్ మూవీని డైరెక్ట్ చేశాడు.

Advertisement

పూరీ జగన్నాథ్ పునీత్ రాజ్‌కుమార్‌ను ఇండస్ట్రీలో లాంచ్ చేశాడు.

కన్నడ స్టార్ డైరెక్టర్లతో లాంచింగ్ చేయించడానికి సిద్ధమైతే అంచనాలు పెరిగిపోయి మొదటి మూవీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని ఆయన ఇలా ప్లాన్ చేశారు.అలానే రాజ్‌కుమార్ కొడుకులు అంటే కథా రచయితలు కూడా చాలా కంటెంట్ ఉన్న కథ రాస్తారు.దీనివల్ల ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయి అవి చేరుకోకపోతే సినిమా ఫీల్ అవుతుంది.

కాబట్టి తెలివిగా సక్సెస్ ఫార్ములా వాడారు.శివరాజ్ కుమార్ నటించిన ఫస్ట్ త్రీ మూవీ సూపర్ హిట్ అయ్యాయి.

మంచి హీరోగా తనకంటూ ఒక స్పెషల్ నేమ్ క్రియేట్ చేసుకున్నాడు.ఓం సినిమాతో అతడు ఇండస్ట్రీ హిట్ లాంటి హిట్టు కొట్టాడు.

దీనికి దర్శకుడు ఉపేంద్ర.ఈ మూవీ 1995 నుంచీ దాదాపు ఓ పదేళ్ల పాటు రీరిలీజ్ అవుతూనే వచ్చింది.

అంటే అందులో అతడి నటన ఎంత బాగుందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.ఇది తెలుగులో ఓంకారంగా రీమిక్స్ చేశారు.

రాజశేఖర్ హీరో.

ఓం సినిమాతో శివన్న అందరికీ ఫేవరెట్ హీరో అయిపోయాడు.ఆ తరువాత రెండు మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.పదేళ్ల తర్వాత జోగి ( jogi )సినిమాతో మళ్లీ ఓం అంతటి హిట్టు కొట్టాడు.

ప్రభాస్ హీరోగా ఈ మూవీని యోగి ( Yogi )పేరుతో రీమేక్ చేశారు.జోగి 2005 సంవత్సరంలోనే దాదాపు 35 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.

ఇలా సినిమాల్లో దూసుకుపోతూనే సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు.అభిమానించే వారందరికీ ఆయన ఎప్పుడూ అండగా ఉంటారు.ప్రజలకు సేవ చేస్తుండగా వచ్చే సంతోషం కంటే మరేదీ గొప్పది కాదు అని శివన్న నమ్ముతాడు.

శివన్నను చూసి తమ్ముడు పునీత్ కూడా సేవా కార్యక్రమాలు చేయడం ప్రారంభించాడు.వీళ్ళిద్దరూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినా పబ్లిసిటీకి దూరంగా ఉంటారు.

వీళ్ళు ఎన్ని గుప్త దానాలు చేసినా అవి అప్పుడప్పుడు బయటపడుతూ వారి గొప్ప మనసును చాటుతాయి.

తాజా వార్తలు