టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది కన్నడ హీరోయిన్లు( Kannada Heroines ) వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.రష్మిక, పూజా హెగ్డే కన్నడ బ్యూటీలు కాగా ఈ హీరోయిన్లు ఇప్పటికే ఊహించని స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు.
రష్మిక( Rashmika ) నేషనల్ క్రష్ గా గుర్తింపును సొంతం చేసుకోగా పూజా హెగ్డే( Pooja Hegde ) వరుసగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్లతో బిజీగా ఉండటం గమనార్హం.
నేహాశెట్టి, కృతిశెట్టి, శ్రద్ధా శ్రీనాథ్, రష్మిక కూడా కన్నడ బ్యూటీలు అనే సంగతి తెలిసిందే.
తెలుగులో సినిమాలతో పాటు సీరియళ్లలో సైతం కన్నడ బ్యూటీలకు ఎక్కువగానే ఆఫర్లు వస్తున్నాయి.అయితే మరో కన్నడ సోయగం టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
కన్నడ బ్యూటీ సంపదకు( Sampada ) శాండిల్ వుడ్ లో మంచి పేరు ఉంది.కన్నడలో సినిమాలతో పాటు సీరియళ్ల ద్వారా సంపద క్రేజ్ పెంచుకున్నారు.
![Telugu Actress Sampada, Sampada, Kannada Sampada, Rao Ramesh, Sundeep Kishan, To Telugu Actress Sampada, Sampada, Kannada Sampada, Rao Ramesh, Sundeep Kishan, To](https://telugustop.com/wp-content/uploads/2024/04/kannada-beauty-sampada-entry-in-tollywood-industry-detailss.jpg)
22 సంవత్సరాల వయస్సులోనే సంపద మోడల్ గా కూడా ఊహించని స్థాయిలో సక్సెస్ అయ్యారు.కన్నడలో వరుస సినిమాలు చేస్తున్న సంపద తెలుగులో సందీప్ కిషన్ కు( Sundeep Kishan ) జోడీగా ఒక సినిమాలో నటించనున్నారని సమాచారం అందుతోంది.సందీప్ నక్కిన త్రినాథరావు కాంబోలో త్వరలో ఒక సినిమాకు సంబంధించిన ప్రకటన తెరకెకక్కనుందని సమాచారం అందుతోంది.
![Telugu Actress Sampada, Sampada, Kannada Sampada, Rao Ramesh, Sundeep Kishan, To Telugu Actress Sampada, Sampada, Kannada Sampada, Rao Ramesh, Sundeep Kishan, To](https://telugustop.com/wp-content/uploads/2024/04/kannada-beauty-sampada-entry-in-tollywood-industry-detailsd.jpg)
ఏకె ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో రాజేష్ దండా ఈ సినిమాను నిర్మిస్తున్నారని సమాచారం అందుతోంది.ఈ సినిమాలో రావు రమేష్ కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది.ఈ సినిమా సక్సెస్ సాధిస్తే కన్నడ బ్యూటీ సంపద తెలుగులో మరింత బిజీ అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
సంపదకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.సంపద అంతకంతకూ క్రేజ్ ను పెంచుకుంటూ ఉండటం గమనార్హం.సంపద కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది.