నీరో చక్రవర్తిని తలపిస్తున్న వైఎస్‌ జగన్‌

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అంటున్నారు.

ఒక వైపు రైతుల ఆత్మహత్యలు.

భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు జరుగుతుంటే మరో వైపు గ్రామ పంచాయతీ కార్యాలయాలకు రంగులు మార్చడం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అనుభవ రాహిత్యంతో జగన్‌ ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Kanna Comments Jagan About Ycp Rulling In Ap-నీరో చక్రవర్

ఈ సందర్బంగా కన్నా లక్ష్మినారాయాణ ట్విట్టర్‌లో ఈ విషయమై స్పందించారు.వైసీపీ పాలన రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో పాలనలా ఉంది.

ఒక వైపు ఇసుక దొరకక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వైసీపీ వాళ్ళు రంగుల పిచ్చితో ఆఖరికి జాతీయ జెండాను అవమానించి దేశ ప్రతిష్టను దెబ్బ తీసే వరకూ వచ్చింది.పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం చట్ట వ్యతిరేకం.

Advertisement

అంటూ ట్వీట్‌ చేశాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు