సోనియా పై సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా!

కంగనా రనౌత్ మహారాష్ట్ర ప్రభుత్వం పై ప్రశ్నలతో విరుచుకుపడుతున్నారు.వాటికి సమాధానాలు చెప్పలేక తలలు పట్టుకుంటున్న మహారాష్ట్ర ప్రభుత్వం.

ప్రజలలో తమకి పోతున్న పరపతిని మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం కోసం, నటి కంగనాను సైలెంట్ చేయడం కోసం తాజాగా ముంబైలో ఉన్న కంగనా ఆఫీస్ ను టార్గెట్ చేసి కూల్చారు.ఇక ఇంటి పై కూడా నోటీసులు ఇచ్చారు.

Kangana Comments On Sonia Gandhi, Sonia Gandhi, Kangana Ranauth, Maharastra Gove

ముంబాయి ప్రభుత్వం కంగనా పట్ల వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది.ఇలాంటి టైంలో కంగనా రనౌత్ ట్విట్టర్ వేదికగా గౌరవనీయులైన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారూ.

మహారాష్ట్ర ప్రభుత్వం నాతో వ్యవహరించిన తీరుపై ఓ మహిళగా మీకెలాంటి బాధా లేదా? రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిపాదించిన సూత్రాలను పాటిస్తూ ప్రభుత్వాన్ని నడపాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి మీరు సూచించలేరా ?ఓ మహిళ పోరాటాన్ని గుర్తించరా ? అంటూ ప్రశ్నించారు.అంతేకాకుండా మీ మౌనం చరిత్ర పుటల్లోకి ఎక్కుతుందని కంగనా సోనియా గాంధీని ఎద్దేవా చేశారు.

Advertisement

మీడియా స్వేచ్ఛ మహిళల స్వేచ్ఛ పరిరక్షణ గురించి ఉపన్యాసాలు ఇచ్చే కాంగ్రెస్ నాయకులు మహారాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ ఇలా కంగనా పై దాడి చేయడం ఏంటని కంగనా ను సపోర్ట్ చేసేవారు కాంగ్రెస్ నాయకులను నిలదీస్తున్నారు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు