సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు వైవిద్యమైన సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించు కుంటు ఉంటారు.ఇక అందులో భాగంగానే ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతున్న శంకర్ కూడా తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
అయితే శంకర్ కమల్ హాసన్ తో చేసిన భారతీయుడు సినిమా( Bharateeyudu )ని మొదట వేరే హీరోతో చేయాలని అనుకున్నాడు.కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ సినిమాని కమలహాసన్ తో చేయాల్సి వచ్చింది.
అసలు విషయంలోకి వెళ్తే మొదట శంకర్ ఈ సినిమాని చిరంజీవితో చేయాలని అనుకున్నాడు.

కానీ చిరంజీవి అప్పుడు కొన్ని సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేకపోయాడు నిజానికి చిరంజీవి కనక కొంచం ఇంట్రెస్ట్ పెట్టీ డేట్స్ అడ్జెస్ట్ చేసి ఈ సినిమా చేస్తే మాత్రం చేసి ఈ సినిమా చిరంజీవి( Chiranjeevi ) కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచి ఉండేదని అప్పట్లో ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేశారు.ఇక అప్పటి నుంచి చిరంజీవి ఇప్పటివరకు కూడా అలాంటి పాత్రను పోషించలేదు.

కాబట్టి ఈ క్యారెక్టర్ తన కెరియర్ లోనే ఒక డిఫరెంట్ రోల్ గా మిగిలిపోయేది కానీ చిరంజీవి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం తో కమల్ హాసన్ తో సినిమా చేసి శంకర్( Shankar ) సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ కూడా వస్తుంది.ఈ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.
మరి మొత్తానికైతే ఈ సినిమా ఎంత మేరకు ప్రేక్షకులను అలరిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమాతో మరోసారి కమల్ హాసన్ తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు…చూడాలి మరి ఈ సినిమా తో శంకర్ ఏ మేరకు సక్సెస్ సాధిస్తాడు అనేది…
.







