Keerthy Suresh Kamal Haasan: కీర్తి సురేష్ పై ప్రశంసల వర్షం కురిపించిన కమల్ హాసన్.. బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్( Keerthy Suresh ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కీర్తి సురేష్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఇటీవల దసరా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది.తెలుగులోనే కాకుండా కోలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తోంది.

తమిళంలో మామన్నన్ మూవీలో( Maamannan Movie ) నటించింది.డైరెక్టర్ మరి సెల్వరాజ్ రూపొందించిన ఈ మూవీలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించారు.

ఈ సినిమా ఆడియో ఫంక్షన్ తాజాగా చెన్నైలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు తమిళ్ సినీ ప్రముఖులలో ఒకరైన కమల్ హాసన్( Kamal Haasan ) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ కీర్తి సురేష్ పై ప్రశంసలు కురిపించారు.

Advertisement

ఈ సందర్బంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.మామన్నన్‌ సినిమా భారీ విజయం సాధించాలని నా కోరిక.

పొలిటికల్ థ్రిల్లర్ సినిమా గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి.మరి సెల్వరాజ్ ఇతరులు అభిప్రాయాలకు విలువ ఇస్తారు.

ఆయనలో అదే నాకు చాలా ఇష్టం.

ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను అని తెలిపారు.అనంతరం కీర్తి సురేష్ గురించి మాట్లాడుతూ.కీర్తి గొప్ప నటి. ఆమె బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ కితాబిచ్చారు.అలాగే ఈ సినిమాలో నటించేందుకు కీర్తి ఒప్పుకోవడం ప్రశంసించదగిన విషయం అని తెలిపారు కమల్ హసన్.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

ఇకపోతే కీర్తి సురేష్ విషయానికి వస్తే.ఇటీవల కాలంలో ఈ ముద్దుగుమ్మ తన స్పీడ్ ని పెంచేసింది.

Advertisement

నాని కీర్తి సురేష్ కలిసి నటించిన దసరా సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది కీర్తి సురేష్.

తాజా వార్తలు