రా ఆఫీసర్ గా మారిపోయిన కళ్యాణ్ రామ్

నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్, బాలకృష్ణ తారక్ తర్వాత ఆ వారసత్వంలో కొనసాగుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న హీరో కళ్యాణ్ రామ్.

ఓ వైపు నిర్మాతగా మరో వైపు హీరోగా కళ్యాణ్ రామ్ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకున్నాడు.

కెరియర్ లో హిట్ రేషియో తక్కువగా ఉన్న అతనొక్కడే, పటాస్ లాంటి సినిమాలతో తన మార్క్ చూపించాడు.అలాగే ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ నిర్మాతగా ముందుకి నడిచాడు.

Kalyan Ram Play Raw Agent Role In New Movie , Tollywood, Nandamuri Hero, Balakri

కళ్యాణ్ రామ్ చివరిగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఎంత మంచివాడవురా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేతిలో మూడు సినిమాల వరకు ఉన్నాయి.అలాగే బోయపాటి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

Advertisement

ఇదిలా ఉంటే పటాస్ సినిమాలో అవినీతి పోలీస్ గా నెగిటివ్ టచ్ ఉన్న పాత్రతో మెప్పించిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు తన కొత్త సినిమాలో ఏకంగా రా ఏజెంట్ గా చేస్తున్నట్లు తెలుస్తుంది.మైత్రీ మూవీ మేకర్స్ లో రాజేంద్ర అనే దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం చేయనున్నారు.

చిత్రబృందం ఇప్పటికే ఒక షెడ్యూల్ చిత్రీకరణను‌ కూడా పూర్తి చేసుకుంది.అయితే ఈ సినిమా ఎమోషనల్ డ్రామా అని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఒక రా ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని సమాచారం.గతంలో పైసా వసూల్ సినిమాలో బాలకృష్ణ రా ఏజెంట్ పాత్రలో నటించి మెప్పించాడు.

ఇప్పుడు కళ్యాణ్ రామ్ బాబాయ్ చేసినటువంటి సీక్రెట్ ఏజెంట్ తరహా పాత్రలో నటించడం విశేషం.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు