ఎన్టీఆర్30 పుకార్లపై క్లారిటీ.. అవన్నీ పుకార్లేనట.. నిజమేంటంటే?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో నాలుగేళ్ళ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో నందమూరి అభిమానులు ఖుషీగా ఉన్నారు.

 Kalyan Ram Checked The Rumors On Ntr 30, Kalyan Ram, Jr Ntr , Koratala Siva , Ntr30 , Young Tiger Ntr , Rumors On Ntr 30, Ntr Koratala Shiva Movie-TeluguStop.com

అయితే ఇది మల్టీ స్టారర్ కావడంతో ఈ సినిమా విజయాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేయలేక పోయారు.

అందుకే తారక్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ 30వ సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు.

 Kalyan Ram Checked The Rumors On NTR 30, Kalyan Ram, Jr NTR , Koratala Siva , NTR30 , Young Tiger NTR , Rumors On NTR 30, Ntr Koratala Shiva Movie-ఎన్టీఆర్30 పుకార్లపై క్లారిటీ.. అవన్నీ పుకార్లేనట.. నిజమేంటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరి ఎన్టీఆర్ ఈ సినిమా భారీ విజయం తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.

ఇప్పటికే NTR30 నుండి కొరటాల మోషన్ పోస్టర్ వదిలి ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసాడు.అయితే సినిమాను అనుకున్న సమయానికి సెట్స్ మీదకు తీసుకు వెళ్లలేక పోతున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాపై చాలా రకాల రూమర్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాను పక్కన పెట్టేశారని కూడా వార్తలు వచ్చాయి.మరి ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన కళ్యాణ్ రామ్ ఈ సినిమాపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టారు.ఈ సినిమా లేట్ అవుతుందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారని తెలుసు.

ట్రిపుల్ ఆర్ సినిమా ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.ఈ అంచనాలను చేరుకునేలా ఈ సినిమాను గ్రాండ్ గా చేయాల్సి ఉందని కళ్యాణ్ రామ్ తెలిపారు.

మరి కొరటాల కూడా ఇదే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రెసెంట్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్న కొరటాల ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు టాక్.ఇక ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.చూడాలి ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube