కిన్నెరసాని అంటూ ఈ సారి యాక్షన్ ట్రై చేస్తున్న కళ్యాణ్ దేవ్

మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ అండదండలతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు కళ్యాణ్ దేవ్.

మెగాస్టార్ చిన్నల్లుడు అయిన కళ్యాణ్ దేవ్ సుస్మితని పెళ్లి చేసుకునే సమయంలోనే అతను కచ్చితంగా హీరోగా ఎంట్రీ ఇస్తాడని అందరూ భావించారు అనుకున్నట్లుగానే చాలా త్వరగా విజేత అనే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు.

తండ్రికొడుకుల సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది.రెండో సినిమాని సూపర్ మెచ్చి టైటిల్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ కథాంశంతో కళ్యాణ్ చేశాడు.

ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయ్యింది.ఇదిలా ఉంటే కళ్యాణ్ దేవ్ తన మూడో సినిమాని కూడా తాజాగా ఎనౌన్స్ చేసేశాడు.

అశ్వద్ధామ ఫేమ్ రమణతేజ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కబోతుంది.

Kalyaan Dhev New Movie Title Kinnerasani, Tollywood, Telugu Cinema, Mega Family,
Advertisement
Kalyaan Dhev New Movie Title Kinnerasani, Tollywood, Telugu Cinema, Mega Family,

ఇదిలా ఉంటే దీపావళి సందర్భంగా కళ్యాణ్ దేవ్ కొత్త మూవీ టైటిల్ ని చిత్ర యూనిట్ ఎనౌన్స్ చేసింది. కిన్నెరసాని అని టైటిల్ ఫిక్స్ చేసి థీమ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ బట్టి చూస్తూ ఉంటే వరంగల్ జిల్లా గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే లవ్ యాక్షన్ కథాంశంగా కనిపిస్తుంది.

అలాగే కంప్లీట్ విలేజ్ టచ్ కనిపిస్తుంది.మొదటి రెండు సినిమా ఫీల్ గుడ్ స్టోరీస్ తో ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేసే కళ్యాణ్ దేవ్ మూడో సినిమా కోసం ఏకంగా మాస్ హీరోయిజంలోకి దిగిపోతున్నాడని పోస్టర్ చూస్తుంటే అర్ధమవుతుంది.

ఈ మధ్యకాలంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ పీరియాడిక్ టచ్ తో ఎమోషనల్ యాక్షన్ డ్రామాతో తెరకెక్కే సినిమాలని ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు.ఈ నేపధ్యంలోనే రమణతేజ కూడా అలాంటి కథతోనే కళ్యాణ్ దేవ్ ని ఆవిష్కరించి హిట్ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తుంది.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి
Advertisement

తాజా వార్తలు