ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి అయిన తాజ్ మహల్ అంటే ఇష్టపడని వారు ఉంటరు.యమునా నది ఒడ్డున ఆగ్రాలో కనిపించే తాజ్‌మహల్‌ను సందర్శించాలని పలువురు భావిస్తుంటారు.
ఏ మాత్రం కాస్త డబ్బులున్నా, దానిని చాలా మంది చూసొస్తుంటారు.విదేశీయులు కూడా దీనిని చూసేందుకు ప్రత్యేకంగా ఇండియాకు వస్తుంటారు.
ఇండియాకు వచ్చిన విదేశీయులు దీనిని చూడకుండా తిరిగి వెళ్లరు.ఈ పాలరాతి కట్టడాన్ని పోలిన మరో తాజ్‌మహల్ ఉందని చాలా కొద్ది మందికే తెలుసు.
కాలా మహల్‌గా పేరొందిన ఆ కట్టడం నల్లని రాతితో కట్టారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
కాలామహల్‌గా పేరొందిన బ్లాక్ తాజ్‌మహల్ నిజంగా ఉంది.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుర్హాన్‌పూర్‌కు సమీపంలో షా నవాజ్ ఖాన్ సమాధినే బ్లాక్ తాజ్ మహల్‌గా పిలుస్తుంటారు.ఉటావలి నది ఒడ్డున ఉండే దీనిని స్థానికంగా దొరికే నల్లరాతితో, చూడడానికి తాజ్ మహల్‌గా కనిపించేలా రూపొందించారు.అయితే తాజ్ మహల్‌తో పోలిస్తే దీని పరిమాణం చాలా చిన్నది.
దీని వెనుక చాలా కథలున్నాయి.మొఘల్ చక్రవర్తి షాజహాన్ యమునా నదికి ఎదురుగా నల్ల పాలరాతితో తాజ్ మహల్ యొక్క ప్రతిరూపాన్ని నిర్మించాలని అనుకున్నాడు.
యమునా నదికి అవతలి వైపున షాజహాన్ తన స్వంత సమాధిని నిర్మించుకోవడం ప్రారంభించాడని, కానీ కుమారులతో యుద్ధం అంతరాయం కలిగిందని కొందరు పరిశోధకులు చెబుతుంటారు.అయితే చాలా మంది పండితులు ఈ ఆలోచన చరిత్ర కంటే కల్పనకు చెందినదని నమ్ముతారు.
ఇస్లామిక్ చట్టం ప్రకారం, మృతదేహాలను మక్కా వైపు వారి ముఖాలతో ఖననం చేస్తారు.దక్షిణం వైపు కాళ్ళు, భర్త తన భార్య యొక్క కుడి వైపున ఉంచుతారు.
దీంతో షాజెహాన్ సమాధిని ఇక్కడ ఉంచడానికి ఉద్దేశించినది కాదని వ్యాఖ్యానం కనిపిస్తుంది.ఏదేమైనా నల్లరాతితో కట్టిన ఈ కాలా మహల్ చాలా మందిని ఆకర్షిస్తోంది.
అచ్చం తాజ్ మహల్‌ను పోలి ఉందని చాలా మంది ప్రశంసిస్తున్నారు.