విజయ్ తో సినిమా చేస్తున్న జ్యోతిక...

జ్యోతిక ( Jyotika ) అప్పట్లో చాలా మ చి సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన సినిమాలు చాలా ఉన్నాయి ఇక ఇప్పుడు ఒక వైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు జ్యోతిక‌.

సీనియ‌ర్ హీరోల ప‌క్క‌న హీరోయిన్‌గానూ మెప్పిస్తున్నారు.

రీసెంట్‌గా చెన్నై నుంచి ముంబైకి షిఫ్ట్ అయ్యారు సూర్య అండ్ జ్యోతిక‌( Surya and Jyotika ).ఇప్పుడు జ్యోతిక‌కు అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయి.జ్యోతిక గురించి రీసెంట్‌గా ఓ న్యూస్ త‌మిళ‌నాడులో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

అదే ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో జ్యోతిక జోడీ( Jyothika paired with Thalapathy Vijay ) క‌డుతున్నార‌నే విష‌యం.దాదాపు రెండు ద‌శాబ్దాల త‌ర్వాత వీరిద్ద‌రు క‌లిసి సినిమా చేస్తున్నార‌న్న‌ది న్యూస్‌.

వెంక‌ట్‌ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నారు ద‌ళ‌ప‌తి విజ‌య్‌.క‌స్ట‌డీ సినిమా రిజ‌ల్ట్ ప‌ట్టించుకోకుండా వెంక‌ట్ ప్ర‌భుకి ఛాన్స్ ఇచ్చారు విజ‌య్‌.

Advertisement

వెంక‌ట్ ప్ర‌భు డైర‌క్ష‌న్ అంటేనే సినిమాలో కామెడీ ఉంటుంద‌న్న‌ది వార్త‌.ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.రీసెంట్‌గానే ద‌ర్శ‌క‌నిర్మాత‌లు జ్యోతిక‌ను క‌లిశార‌ట‌.

త‌మ సినిమా స‌బ్జెక్ట్ చెప్ప‌గానే జ్యోతిక ఓకే అని అన్నార‌ట‌.దాదాపు 20 ఏళ్ల త‌ర్వాత విజ‌య్ తో సినిమా అన‌గానే ఎగ్జ‌యిటింగ్‌గా ఉంద‌ని అన్నార‌ట జ్యోతిక‌.

విజ‌య్ - జ్యోతిక జోడీకి సిల్వ‌ర్ స్క్రీన్ మీద ఇంకా చ‌రిష్మా ఉంది.వాళ్లిద్ద‌రినీ బెస్ట్ ఆన్‌స్క్రీన్ పెయిర్స్ అని అంటుంటారు జ‌నాలు.

ఖుషి, తిరుమ‌లైతో స‌క్సెస్ చూశారు ఇద్ద‌రూ.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

విజ‌య్‌తో జ్యోతిక న‌టిస్తార‌నే విష‌యాన్ని మేక‌ర్స్ త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్‌గా అనౌన్స్ చేయ‌నున్నారు.యువ‌న్ శంక‌ర్ రాజా ఈ సినిమాకు సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.విజ‌య్ ప్ర‌స్తుతం లియో షూటింగ్‌లో ఉన్నారు.

Advertisement

బ్లాక్ బ‌స్ట‌ర్ ఆన్‌ స్క్రీన్ జోడీ త్రిష ఈ సినిమాలో న‌టిస్తున్నారు.లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

అక్టోబ‌ర్ 19న సినిమా విడుద‌ల కాగానే, వెంక‌ట్ ప్ర‌భు సినిమా గురించి ఆలోచిస్తారు విజ‌య్‌.జ్యోతిక నార్త్ లో ప‌లు చిత్రాల‌తో బిజీగా ఉన్నారు.

ఈ మ‌ధ్య మ‌ల‌యాళంలోనూ ఓ మూవీని కంప్లీట్ చేశారు.

తాజా వార్తలు