టీఆర్‌ఎస్‌కు గుడ్‌ బై చెప్పబోతున్న మాజీ మంత్రి

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓటమి పాలయిన విషయం తెల్సిందే.అప్పటి నుండి కూడా ఆయన పార్టీకి దూరం అవుతూ వచ్చారు.

ముఖ్యంగా జూపల్లిపై గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లో జాయిన్‌ అవ్వడంతో ఆ నియోజక వర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మొత్తం కూడా ఆయన వెంట ఉండటం జూపల్లికి నచ్చలేదు.పార్టీ నాయకత్వం కూడా జూపల్లికి ప్రాధాన్యత తగ్గించింది.

దాంతో మొన్నటి పుర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌ ఇచ్చాడు.కొల్లాపూర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో తన సత్తా చాటాడు.

ఆ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూపల్లి టీఆర్‌ఎస్‌కు చుక్కలు చూపించాడు.కేటీఆర్‌ మాట్లాడినా కూడా జూపల్లి వెనక్కు తగ్గలేదు.

Advertisement

జూపల్లి తన వర్గంను ఇండిపెండెంట్స్‌గా పోటీ చేయించాడు.దాంతో అక్కడ టీఆర్‌ఎస్‌కు భారీ నష్టం చేకూరింది.

ఇప్పుడు జూపల్లి టీఆర్‌ఎస్‌లో కొనసాగలేని పరిస్థితి ఉంది.అందుకే ఆయన అతి త్వరలోనే కారు దిగి కాంగ్రెస్‌ లేదా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

ఆయన సన్నిహితులు మాత్రం కాంగ్రెస్‌లో జాయిన్‌ అయ్యే అవకాశం ఉందంటున్నారు.

ఈ పద్ధతిలో వేడి నీరు తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు..
Advertisement